iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: రైతు బిడ్డకు గడ్డుకాలం? ఇకపై అది కష్టమేనా?

  • Published Oct 09, 2023 | 4:58 PM Updated Updated Oct 09, 2023 | 4:58 PM
  • Published Oct 09, 2023 | 4:58 PMUpdated Oct 09, 2023 | 4:58 PM
Bigg Boss 7 Telugu: రైతు బిడ్డకు గడ్డుకాలం? ఇకపై అది కష్టమేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డులు రావడం వల్ల ఇప్పటికే ఇంట్లో ఉన్న సభ్యులకు ఇబ్బందులు తప్పవని అందరికీ తెలిసిందే. అయితే అందరితో పోలిస్తే పల్లవి ప్రశాంత్ కు కాస్త ఎక్కువగా ఇబ్బందులు కలిగే ఆస్కారం కనిపిస్తోంది. ఎందుకంటే వైల్డ్ కార్డుల్లో వచ్చిన ఒకరి వల్ల పల్లవి ప్రశాంత్ కు చాలానే ఇక్కట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అతని బయట ఉన్న సపోర్ట్ కూడా సన్నగిల్లచ్చు. అయితే అంతలా డ్యామేజ్ జరగడానికి ఆస్కారం ఉందా అంటే? కచ్చితంగా ఉందనే చెప్పాలి. అది కూడా వైల్డ్ కార్డు ఎంట్రీల వల్లే అది జరగచ్చు.

పల్లవి ప్రశాంత్ ఆటపై అందరికీ నమ్మకం ఉంది. రైతుబిడ్డ హౌస్ లో ఇంకా గొప్పగా ఆడతాడు అని అందరూ నమ్ముతున్నారు. అయితే ఆదివారం హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డుల ద్వారా ప్రశాంత్ కు కొన్ని ఇబ్బందులు కలిగే ఆస్కారం కనిపిస్తోంది. గ్రాండ్ లాంఛ్ 2.0లో హౌస్ లోకి అంబటి అర్జున్, పూజా మూర్తి, నయనీ పావని, అశ్వినీ శ్రీ, భోలే షావలి వచ్చారు. వీరిలో నలుగురిని పక్కన పెడితే భోలే షావలితో మాత్రం రైతు బిడ్డకు కాస్త నష్టం జరిగుతుంది అనే చెప్పాలి. ఎందుకంటే అందుకు కొన్ని బలమైన కారణాలే ఉన్నాయి. ఇప్పటి వరకు రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ కు బయట మంచి సపోర్ట్ లభించింది. ఇప్పటి నుంచి పాట బిడ్డ కూడా ఇందుకు పోటీ రాబోతున్నాడు.

పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అయితే.. తాను పాట బిడ్డను అంటూ భోలే షావలి స్టేజ్ మీద పరిచయం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రశాంత్- తాను ప్రకృతి బిడ్డలం అని చెప్పాడు. ప్రశాంత్ అన్నం అయితే తాను కూరలాగా కలిసిపోతాను అని చెప్పాడు. ఇద్దరూ తెలంగాణ వాళ్లు కావడం, ఇద్దరికీ బయట మంచి ఫాలోయింగ్, సింపథీ ఉండటంతో కచ్చితంగా సపోర్ట్ చీలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటివరకు పల్లవి ప్రశాంత్ కు పడిన ఓట్లు తప్పకుండా చీలిపోతాయి. అలాగే శివాజీ విషయంలో కూడా ప్రశాంత్ కు భోలే నుంచి పోటీ ఉంటుంది. ఎందుకంటే భోలే షావలీకి శివాజీ బయట కూడా పరిచయం అని అర్థమైపోయింది.

రాగానే భోలే అంటూ కౌగిలించుకున్నాడు. హౌస్ లో ప్రశాంత్ కు శివాజీ నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఆ సపోర్ట్ కాస్తా.. యావర్- భోలే షావలితో కలిసి పంచుకోవాల్సి ఉంటుంది. అలా కూడా పల్లవి ప్రశాంత్ నష్టపోక తప్పడం లేదు. భోలేని చూస్తే ఇట్టే కలిసిపోయే మనిషిలా కనిపిస్తున్నాడు. ప్రశాంత్ తో పోలిస్తే కాస్త మాటకారిగానే ఉన్నాడు. పైగా సింగర్ కావడంతో హౌస్ లో ఉన్న సభ్యులు భోలేతో త్వరగా ఫ్రెండ్స్ అయ్యే అవకాశం ఉంది. ఇలా ఏ విధంగా చూసినా కూడా పల్లవి ప్రశాంత్ కు భోలే షావలి నుంచి గట్టిగానే పోటీ ఉండేలా కనిపిస్తోంది. ఇప్పుడు ఏ విధంగా చూసినా కూడా ప్రశాంత్ కు బ్యాడ్ టైమ్ ప్రారంభం కాబోతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. భోలే షావలి ఎంట్రీతో పల్లవి ప్రశాంత్ కి నిజంగానే నష్టం జరగబోతోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş