iDreamPost
android-app
ios-app

కుటుంబాల జోలికి రావొద్దు.. అమర్ కు మానస్ సపోర్ట్!

  • Published Nov 01, 2023 | 1:17 PM Updated Updated Nov 01, 2023 | 1:17 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఆసక్తిగానే సాగుతోంది. అయితే హౌస్ లో అమర్ దీప్- శివాజీ మధ్య గొడవ అయితే కొనసాగుతూనే ఉంది. వీళ్ల గొడవపై తాజాగా మానస్ నాగులపల్లి స్పందించాడు. ఇద్దరి గేమ్ పై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఆసక్తిగానే సాగుతోంది. అయితే హౌస్ లో అమర్ దీప్- శివాజీ మధ్య గొడవ అయితే కొనసాగుతూనే ఉంది. వీళ్ల గొడవపై తాజాగా మానస్ నాగులపల్లి స్పందించాడు. ఇద్దరి గేమ్ పై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు.

  • Published Nov 01, 2023 | 1:17 PMUpdated Nov 01, 2023 | 1:17 PM
కుటుంబాల జోలికి రావొద్దు.. అమర్ కు మానస్ సపోర్ట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట మరింత ఉత్కంఠగా సాగుతోంది. ఎవరికి వాళ్లు టైటిల్ ఫేవరెట్ కావాలంటూ పోటీ పడుతున్నారు. కొందరు మాత్రం మైండ్ గేమ్స్ తో దూసుకుపోతున్నారు. మైండ్ గేమ్ అనగానే ముఖ్యంగా హౌస్ లో శివాజీ పేరు గొర్తొస్తుంది. అయితే శివాజీ టార్గెట్ అంతా అమర్ పైనే అనేట్లుగా ఆట ఉంటోంది. అదే విషయాన్ని బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన సీరియల్ ఆర్టిస్ట్, అమర్ ఫ్రెండ్ మానస్ నాగులపల్లి కూడా వ్యక్త పరిచాడు. శివాజీ కావాలనే అమర్ ని టార్గెట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అలాగే కుటుంబాల జోలికి రావద్దు అంటూ వ్యాఖ్యానించాడు.

“నేను రోజూ అమర్ భార్య తేజశ్వినీతో మాట్లాడుతున్నాను. ఆమె 24 గంటలు ఆట చూస్తూనే ఉంది. గంట ఎపిసోడ్ చూసిన నాకే అమర్ విషయంలో ఎంతో బాధగా ఉంది. బిగ్ బాస్ వల్ల అమర్ ఫ్యామిలీ కూడా ఎంతో ఇబ్బంది పడుతోంది. మెంటల్ గా, ఫిజికల్ గా, పైనాన్షియల్ గా కూడా అమర్ ఫ్యామిలీ ఎంతో ఇబ్బంది పడుతోంది. నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నా ఫ్యామిలీ ఎలా అయితే ఇబ్బంది పడిందో.. అమర్ ఫ్యామిలీ కూడా అలాగే ఇబ్బంది పడుతోంది. పీఆర్ టీమ్స్ అందరూ అమర్ ని ఎంత దిగజార్జాలో దిగజార్చుకోండి. ఎంత తిట్టాలో తిట్టుకోండి. కానీ, ఫ్యామిలీ జోలికి మాత్రం రావద్దు. నేను మీ అందరికీ చేస్తున్న ముఖ్యమైన రిక్వెస్ట్ ఇదే. దయచేసి కుటుంబాల జోలికి రాకండి.

బిగ్ బాస్ హౌస్ లో అమర్ దీప్ ని శివాజీ టార్గెట్ చేయడం కచ్చితంగా గేమ్ స్ట్రాటజీనే అవుతుంది. ఆయన హౌస్ లో ఉన్న అందరినీ దగ్గరకు తీసుకుంటారు. వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్లను కూడా కూతురు, బిడ్డ అంటూ మాట్లాడతారు. కానీ, అమర్ ని మాత్రం దగ్గరకు రానివ్వరు. మీరు అతనితో కలిస్తేనే కదా అతను అంటే ఏంటో మీకు అర్థమయ్యేది. తేజ వచ్చి అమర్ బాగా ఆడుతున్నాడు అని చెబితే.. వాడు ఏం ఆడతన్నాడు. మిగిలిన వాళ్లంతా బాగా ఆడుతున్నారు అని చెబుతున్నాడు. ఇలాంటివి చేస్తున్నారు అంటే అది పక్కా స్ట్రాటజీనే అవుతుంది. ఇది కూడా 3 గంటల సినిమా లాంటిదే. కాకపోతే బిగ్ బాస్ 3 నెలలు జరుగుతుంది.

ఈ బిగ్ బాస్ లో కూడా ఒక హీరో ఒక విలన్ ఉంటారు. విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే.. హీరో అంత ఎలివేట్ అవుతాడు. అమర్ దీప్ స్ట్రాగ్ అని శివాజీకి తెలుసు అందుకే అమర్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఎవరు హీరోనే.. ఎవరు విలనో వాళ్ల జర్నీనే డిసైడ్ చేస్తుంది. అమర్ ని హర్ట్ చేసేలా శివాజీ మాట్లాడుతున్న మాటలు లైవ్ లో వస్తున్నాయి. కానీ, ఎపిసోడ్ లో మాత్రం రావడం లేదు” అంటూ మానస్ నాగులపల్లి వ్యాఖ్యానించాడు. అమర్ దీప్- శివాజీ విషయంలో మానస్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom