iDreamPost
android-app
ios-app

బాలీవుడ్‌కి హిట్ ఇచ్చి ఊపిరి పోసిన హీరో.. 5 కోట్ల కార్‌ని గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత..

  • Published Jun 25, 2022 | 8:10 PM Updated Updated Jun 25, 2022 | 8:10 PM
  • Published Jun 25, 2022 | 8:10 PMUpdated Jun 25, 2022 | 8:10 PM
బాలీవుడ్‌కి హిట్ ఇచ్చి ఊపిరి పోసిన హీరో.. 5 కోట్ల కార్‌ని గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత..

రెండేళ్లుగా బాలీవుడ్ కి ఒక్క సరైన హిట్ లేదు, ఇంకో పక్క సౌత్ సినిమాలు బాలీవుడ్ లో సక్సెస్ అవుతున్నాయి. దీంతో బాలీవుడ్ వాళ్ళు హిట్ కోసం పరితపిస్తున్నారు. ఏ జోనర్ లో సినిమా చేసినా అది ప్లాప్ గానే మిగులుతుంది. హిట్స్ కోసం కాచుకు కూర్చున్న బాలీవుడ్ కి ఇటీవల ‘భూల్‌ భులాయా 2’ సినిమాతో భారీ విజయం లభించింది. యువ హీరో కార్తీక్‌ ఆర్యన్‌, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమా హారర్ కామెడీ జోనర్ లో వచ్చి సూపర్ హిట్ కొట్టి బాలీవుడ్ కి ఊపిరి పోసింది.

భూల్‌ భులాయా 2 సినిమా కలెక్షన్ల పరంగా కూడా అదరగొడుతుంది. ఇప్పటిదాకా దాదాపు 180 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ‘భూల్‌ భులాయా 2’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించడంతో దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా ఇవ్వలేని సక్సెస్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ ఇవ్వడంతో అందరూ కార్తీక్ ని అభినందిస్తున్నారు.

ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు తాజాగా నిర్మాత భూషణ్‌ కుమార్‌ హీరో కార్తీక్ ఆర్యన్ కి మెక్‌లారెన్‌ జీటీ అనే స్పోర్ట్స్‌ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని ఖరీదు దాదాపు రూ.5 కోట్లు ఉంటుంది. మరో ప్రత్యేకత ఏంటంటే ఇండియాలో ఈ కారు సొంతం చేసుకున్న ఏకైక వ్యక్తిగా కార్తీక్‌ నిలిచాడు. ఈ కారుతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు కార్తీక్. ట్విట్టర్ లో ఈ ఫోటోలు పోస్ట్ చేసి.. ”కష్టానికి ప్రతిఫలం ఇంత పెద్దదిగా ఉంటుందనుకోలేదు. నేనిప్పుడు ఇండియాలోనే మొట్టమొదటి మెక్‌లారెన్‌ జీటీ యజమానిని. నెక్స్ట్‌ టైం ప్రైవేట్‌ జెట్‌ గిఫ్ట్‌ ఇవ్వండి సర్‌” అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. ఇప్పటికే కార్తీక్ దగ్గర చాల ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటిల్లో ఇది కూడా చేరిపోయింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş