iDreamPost
iDreamPost
హైదరాబాద్, బేగం బజార్ పరువు హత్యలో కొత్త సంగతులు బైటకొస్తున్నాయి. ప్రమాదముందని సంజన తల్లి నీరజ్-సంజనలను ముందుగానే హెచ్చరించింది. అయినా వాళ్లు వినలేదు. సొంతంగా బతకాలనుకున్నారు, అందుకే సంజన బంధువులు నీరజ్ పట‍్ల మరింత ద్వేషాన్ని పెంచుకున్నారు. నీరజ్ పర్వాన్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో ఇలా కీలక అంశాలు నమోదైయ్యాయి.
కులాంతర వివాహం కావడం, చెప్పినా వినకపోవడం వల్లే, పరువు పోయిందన్న అవమానభారంతోనే నీరజ్‌ను హత్య చేశామని, నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. ఇంకో కీలకమైన సంగతి, బాబు పుట్టినతర్వాత, కొందరితో నీరజ్ రెచ్చగొట్టేలా బిహేవ్ చేశాడని, చాలా మాటలు అన్నాడని నిందుతులు పోలీసులకు చెప్పారు. ఆ తర్వాత యాదవ్ సమాజ్‌లోని కార్యక్రమాలకుకూడా, సంజన కుటుంబీకులను పిలవకపోవడంతో, ఆ కుటుంబం కోపం పెంచుకుందంట.
గతేడాది ఏప్రిల్‌లో సంజనకు, మరో అబ్బాయితో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. కాని, ముందే ఇంట్లోంచి వెళ్లిపోయిన సంజన, నీరజ్‌ను షంషీర్‌గంజ్‌లోని సాయిబాబా ఆలయంలో పెళ్లి చేసుకుంది.
బాబు పుట్టాక తన తల్లితో కాంటాక్ట్ లోకి సంజన వచ్చింది, మాట్లాడింది. ఎప్పుడూ బేగం బజార్‌కు రావొద్దని, సంజనను తల్లి హెచ్చరించింది. అయినా పట్టించుకోని ఆ జంట.. బేగం బజార్‌లోనే కాపురం పెట్టింది. ఎలాగైనా నీరజ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేసుకున్న నిందితులు. జుమేరాత్ బజార్‌లో కత్తులు, రాడ్లు కొన్నారు. శుక్రవారం రాత్రి నీరజ్ కోసం ఓ కుర్రాడితో రెక్కీ చేశారు. తాతతో కలిసి బైక్‌పై వెళ్తున్న నీరజ్ కంట్లో కారం చల్లి, పొడిచి చంపేశారు.