iDreamPost
iDreamPost
మనకి కావాల్సిన వాటిని, ఇష్టమైన వాటిని కస్టపడి అయినా సంపాదించి కొనుక్కుంటాం. ఓ యాచకుడు బిక్షాటనతో సంపాదించి తన భార్య కోసం బైక్ కొన్న సంఘటన అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన సంతోష్ కుమార్ సాహు అనే ఓ యాచకుడు శారీరకంగా వికలాంగుడు కూడా. దీంతో అతను అన్ని పనులకు తన భార్య మున్నిపైనే ఆధారపడతాడు.
అయితే సాహుకి ఉన్న ట్రై సైకిల్ మీద కూర్చొని తన భార్య తోస్తుంటే అందరి దగ్గర అడుక్కుంటూ ఉంటాడు. అక్కడి రోడ్లు బాగోని కారణంగా తన భార్య ఆ సైకిల్‌ని నెట్టలేక ఇబ్బంది పడుతుంది. అంతేకాక ఆ ట్రై సైకిల్ తోస్తుంటే వెన్ను నొప్పి వస్తుందంటూ సాహు భార్య తరుచు బాధపడేది. దీంతో ఆమెకోసం ఎలాగైనా ఒక మంచి బైక్ కొనాలని డిసైడ్ అయ్యాడు.
దీంతో నాలుగేళ్లుగా అతను ఉండే ప్రదేశాలలో బస్ స్టేషన్‌లు, దేవాలయాలు, మసీదులు.. ఇలా జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో భిక్షాటన చేసి డబ్బు సంపాదించాడు. తనకి కావాల్సినంత డబ్బు సంపాదించాక ఒక మోపెడ్ ని కొందామని నిర్ణయించుకున్నాడు. దాని గురించి ఆరా తీసి సూమారు రూ. 90 వేలు ఖరీదు చేసే మోపెడ్‌ని కొని, దాన్ని తనకి తగ్గట్టు మార్చుకొని తన భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. దీంతో ఈ జంట ఈ కొత్త మోపెడ్ పై సియోని, భోపాల్, ఇండోర్ లాంటి ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్‌లు వేస్తున్నారు. వేరే ప్రదేశాలకు వెళ్లి అడుక్కోవాలంటే దీనిపైనే వెళ్తున్నారు. ప్రస్తుతం వీరు మోపెడ్ పైన వెళ్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
A beggar from Chhindwara in Madhya Pradesh bought a moped worth Rs 90,000 for his wife after she complained of backache @ndtv@ndtvindia pic.twitter.com/9srzxKrFCx
— Anurag Dwary (@Anurag_Dwary) May 25, 2022