బాహుబలి రేంజ్ లో ఇంకో సినిమా

భారతీయ సినిమా చరిత్రలో బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలిని తలదన్నే మూవీ తీయాలని బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా ఎందరో ప్రయత్నించారు కాని దాన్ని కనీసం టచ్ కూడా చేయలేకపోయారు . అంత పెద్ద మార్కెట్ ఉన్న విజయ్ పులి పేరుతో ఓ గ్రాఫిక్ ఓరియెంటెడ్ మూవీ తీస్తే శ్రీదేవి లాంటి దిగ్గజాలు సైతం దాన్ని కాపాడలేకపోయారు. ఇక హిందిలో పాని పట్ లాంటి ప్రయత్నాలు ఎన్నో జరిగాయి కాని అవేవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయారు. కాని తాజాగా ప్రియదర్శన దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మరక్కర్ – అరబికడలింటే సింహం మీద అంచనాలు అంతకాంతా పెరిగిపోతున్నాయి.

మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ విజువల్ వండర్ మీద బడ్జెట్ ఎంత పెడుతున్నారనే వార్తలు బయటికి రావడం లేదు కాని సుమారు 200 కోట్ల దాకా ఉండొచ్చని ఇన్ సైడ్ టాక్. మోహన్ లాల్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీలో అతని కొడుకు ప్రణవ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 16వ శతాబ్దానికి చెందిన కుంజలి మరక్కర్ IV అనే నావికుడు కథతో రూపొందుతున్న ఈ మూవీలో తారల లిస్టు చాలా పెద్దదే ఉంది. కీర్తి సురేష్, యాక్షన్ కింగ్ అర్జున్, మంజు వారియర్, సుహాసిని తదితరులతో పాటు బయటికి రివీల్ చేయని ఇంకొందరు స్టార్స్ కూడా ఇందులో ఉంటారట.

మలయాళంలో రూపొందుతున్నప్పటికీ ఇతర బాషల ప్రేక్షకులకు సైతం కనెక్ట్ అయ్యేలా దర్శకుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే మల్లువుడ్ లో దీని మీద భారీ అంచనాలు ఉండగా డబ్బింగ్ హక్కుల కోసం క్రేజీ ఆఫర్లు వస్తున్నట్టుగా చెబుతున్నారు. లూసిఫర్ తర్వాత మోహన్ లాల్ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ అక్కడ కొట్టలేదు. ఈసారి ఒకే దెబ్బకు అన్ని పిట్టలు తరహాలో ఈ మరక్కర్ తో గట్టిగా బ్లాక్ బస్టర్ కొట్టాలని డిసైడ్ అయ్యారట. తనదైన శైలీలో అన్ని రకాల జానర్స్ లోనూ హిట్లు అందుకున్న ప్రియదర్శన్ కు పీరియాడిక్ డ్రామా చేయడం మాత్రం ఇదే మొదటిసారి. బ్రిటిషర్ల కాలం నాటి పోరాటాలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చేసిన నేపథ్యంలో ఇప్పుడీ మరక్కర్ ఏ కోణంలో ప్రత్యేకంగా నిలుస్తాడో వేచి చూడాలి

Show comments