iDreamPost
android-app
ios-app

ఆనంద్‌ లేదా విరాజ్‌.. పెళ్లిపై ప్రశ్నకు బేబీ దిమ్మతిరిగే సమాధానం!

  • Published Aug 30, 2023 | 11:59 AM Updated Updated Aug 30, 2023 | 11:59 AM
  • Published Aug 30, 2023 | 11:59 AMUpdated Aug 30, 2023 | 11:59 AM
ఆనంద్‌ లేదా విరాజ్‌.. పెళ్లిపై ప్రశ్నకు బేబీ దిమ్మతిరిగే సమాధానం!

యూట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్‌లు, వెబ్‌ సిరీస్‌లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు వైష్ణవి. తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. హీరో చెల్లెలు, కోడలు ఇలా చాలా పాత్రల్లో నటించారు. ఇలాంటి సమయంలో ‘బేబీ’ సినిమా వైష్ణవి జీవితాన్ని మార్చేసింది. బేబీ సినిమాలో ఆమె నటనకు కుర్రకారు ఫిదా అయిపోయారు. సినిమా సూపర్‌ హిట్‌ అవ్వటంలో వైష్ణవి అందం, అభినయం కూడా ముఖ్య పాత్ర పోషించాయని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయితే, బేబీ సినిమాలో వైష్ణవి ఆనంద్‌ను ప్రేమించి.. విరాజ్‌తో అత్యంత చనువుగా మెలుగుతుంది. తనను ప్రేమించిన ఇద్దర్నీ కాకుండా మూడో వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవిని.. ‘ ఆనంద్‌ లేదా విరాజ్‌’ ఇద్దరిలో ఎవర్ని పెళ్లి చేసుకుంటారు?’ అని అడగ్గా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఇద్దరూ కాదు.. అంటే.. ఒక్కొక్కరిలో ఒక్కో క్వాలిటీ మంచిగా ఉంటది’’ అంటూ షాక్‌ ఇచ్చింది. ‘‘ మీరు వైష్ణవి క్యారెక్టర్‌ను ఇష్టపడతారా?’’ అన్న మరో ప్రశ్నకు..

‘‘ అవును! ఐ లవ్‌ వైష్ణవి క్యారెక్టర్‌’’ అని అంది.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  కాగా,  ఈ సినిమా థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తోంది. ఓటీటీకి వచ్చిన 24 గంటల్లోనే కొన్ని మిలియన్ల వాచ్‌ అవర్స్‌ వచ్చాయి. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. మరి, ఆనంద్‌, విరాజ్‌లో ఎవ్వరినీ పెళ్లి చేసుకోను అంటూ వైష్ణవి చెప్పటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş