Ayodhya Mandir-Ram Lalla Jewellery Cost: అయోధ్య రామయ్య ఆభరణాల వివరాలు.. మొత్తం ఎన్ని కోట్లంటే?

అయోధ్య రామయ్య ఆభరణాల వివరాలు.. మొత్తం ఎన్ని కోట్లంటే?

Ayodhya Mandir-Ram Lalla Jewellery: అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. సర్వాంగాసుందరంగా అలంకృతుడైన రాముడి విగ్రహం చూసి భక్తులు పులకించిపోతున్నారు. మరి రామయ్యకు అలంకరించిన ఆభరణాలు ఏవి అంటే..

Ayodhya Mandir-Ram Lalla Jewellery: అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. సర్వాంగాసుందరంగా అలంకృతుడైన రాముడి విగ్రహం చూసి భక్తులు పులకించిపోతున్నారు. మరి రామయ్యకు అలంకరించిన ఆభరణాలు ఏవి అంటే..

కోట్ల మంది ప్రజల వందల ఏళ్ల నిరీక్షణకు నేటితో తెరపడింది. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితులు మంత్రోచ్ఛోరణాల మధ్య.. ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రాణప్రతిష్ట సంకల్ప పూజ చేశారు. ఆ తర్వాత బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 12.29 గంటలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. 84 సెకన్లపాటు ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఈ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

నగుమోముతో.. కరుణ కురిపించే నయనాలతో.. బాలరాముడి దివ్యమంగళ రూపం చూసిన భక్తులు పులకించిపోయారు. నిజంగానే ఆ చిన్న రామయ్యనే మన వైపు అంతులేని ప్రేమతో చూస్తున్నట్లుగా.. జీవ కళ ఉట్టిపడలా విగ్రాహాన్ని చెక్కారు. అంతేకాక ఆయనకు అనేక రకాల ఆభరాణాలు అలంకరించారు. వజ్రాలు, పగడాలు పొదిగిన బంగారు ఆభరణాలతో రామయ్యను అలంకరించారు. వజ్రాలు పొదిగిన బంగారు తిలకాన్ని ఆయన నుదుటిపై దిద్దారు. మెడలో రత్నాల కాసుల హారం, తలపై వజ్రవైఢూర్యాలు పొదిగిన కిరీటం అలంకరించారు.

ఆయన పాదాల వద్ద బంగారు కమలాలను ఉంచారు. ఆయన మెడలో నిలువెత్తు బంగారు హారాన్ని అలంకరించారు. నడుముకు వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగిన వడ్డానం ధరింపజేశారు. చేతిలో ధనుర్భాణాలతో.. పట్టు పీతాంబరాలు ధరించి.. మరోసారి అయోధ్యను ఏలడానికి వచ్చిన యువరాజుగా దర్శనం ఇచ్చాడు. ఇక బాలరాముడి అలంకరించిన ఆభరణాల విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మందిర నిర్మాణం కోసం వచ్చిన విరాళాల నుంచే వీటిని తయారు చేయించారని చెబుతున్నారు. అయోధ్య ట్రస్ట్‌ బాలరాముడికి బంగారు ఉంగరం బహుకరించింది.

బాలరాముడికి కు పట్టు వస్త్రాలు , పీతాంబరం, పాదుకలు, ఛత్రం సమర్పించారు మోదీ. బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. వైదిక మంత్రాల మధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ప్రపంచమంతా రామనామస్మరణ జరుగుతుండగా ఈ కార్యక్రమం జరిగింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు.

మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో అయోధ్య నగరం మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆధ్యాత్మిక శోభతో అయోధ్య కళకళలాడింది. ఎటు చూసినా రామనామ స్మరణతో మార్మోగింది. నగరమంతా రామ్‌ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు అయోధ్యకు వచ్చి ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నార.

ఈ మహత్తర ఘట్టాన్ని స్వయంగా వీక్షించేందుకు దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7 వేల మందికిపైగా అయోధ్యకు తరలి వచ్చారు. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ప్రాణ ప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి మురిసిపోయారు.

Show comments