iDreamPost
android-app
ios-app

అందరికంటే బిజీ హీరోయిన్

  • Published Jul 01, 2021 | 12:05 PM Updated Updated Jul 01, 2021 | 12:05 PM
అందరికంటే బిజీ హీరోయిన్

టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉన్న మాట వాస్తవం. అందులోనూ చిన్న సినిమాల హీరోలను డీల్ చేస్తున్న దర్శకులకు ఇదో పెద్ద సవాల్ గా మారిపోయింది. టాలెంట్ అందం రెండు ఉండి తక్కువ పారితోషికం తీసుకునేవాళ్ళు భూతద్దం పెట్టి వెతికినా దొరకడం లేదు. అందుకే ఉన్నంతలో బెస్ట్ ఆప్షన్స్ వైపు దృష్టి పెడుతున్నారు. ఈ కారణంగానే ఎనిమిదేళ్ల క్రితం డెబ్యూ చేసిన బ్యూటీ చేతిలో ఇప్పుడు ఏకంగా అరడజను పైగా ఆఫర్లు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. అవికా గోర్ విషయంలో అదే జరుగుతోంది. 2013లో ఉయ్యాలా జంపాలతో తెరంగేట్రం చేసిన ఈ చిన్నారి పెళ్లి కూతురికి మొదల్లో కెరీర్ బాగానే సాగింది.

సినిమా చూపిస్త మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి చెప్పుకోదగ్గ హిట్లు పడ్డాయి కానీ ఆ తర్వాత కథల ఎంపికలో తడబాటుతో పాటు అంతగా ఇమేజ్ లేని హీరోల సరసన చేయడంతో త్వరగానే గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అందులోనూ కాస్త బొద్దుగా అనిపించే తన బాడీ నేచర్ కూడా అవకాశాలకు బ్రేక్ వేసింది. దీంతో విరామం తీసుకుని ఎలాగోలా సన్నబడటం ఇప్పుడు విపరీతంగా కలిసి వస్తోంది. నిన్న సోషల్ మీడియాలో తన పుట్టిన రోజు సందర్భంగా వివిధ నిర్మాణ సంస్థలు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్లు వీడియోలు విడుదల చేయడం చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు.

నాగ చైతన్య థాంక్ యు, ఆది సాయి కుమార్ అమరన్, కళ్యాణ్ దేవ్ సినిమా, జీ నిర్మించిన నెట్, కార్తీక్ – హేమంత్ – రవితేజ ఈ ముగ్గురు తీస్తున్న వేర్వేరు సినిమాల్లో తనే హీరోయిన్. స్వంత బ్యానర్ మీద రూపొందుతున్న పాప్ కార్న్ కూడా లైన్ లో ఉంది. ఇవి కన్ఫర్మ్ గా సైన్ చేసినవి, దాదాపుగా అన్నీ ప్రొడక్షన్ లో ఉన్నవి. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నవి వేరే ఉన్నాయట. ఇలా ఏడెనిమిది సినిమాలతో ఇంత బిజీగా వేరెవరు లేరన్న మాట వాస్తవం. దీన్ని బట్టే నిర్మాతలకు ఆప్షన్లు బాగా తగ్గిపోయాయి కాబట్టే అవికా లాంటి వాళ్ళకు సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ ఇంత స్పీడ్ గా సాగుతోందని చెప్పొచ్చు. చైతు థాంక్ యులో అవికా చెల్లిగా నటిస్తున్నట్టు సమాచారం

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet