iDreamPost
iDreamPost
అస్సాంలోని కాచర్ జిల్లాలోని ఓ లేడీ కానిస్టేబుల్ ఓ ప్రశ్నను లేవనెత్తింది. ఉద్యోగం చేస్తున్న తల్లికి కనీస గౌరవం కూడా మనం ఇవ్వలేమా? ఏడునెలల పాపతో ఉద్యోగానికి వస్తోంది. ఆమె పేరు సంచిత రాణి. సిల్చార్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్. ఆమె మెటర్నటీ లీవు అయిపోయింది. ఇంటిదగ్గర చూసుకోవడానికి ఎవరూ లేరు. లీవ్ ను పెంచమంటే ఉన్నతాధికారులు ఒప్పుకోలేదు. అందుకే పాపతో కలసి ఉదయం పదిన్నరకి ఆఫీసుకొస్తుంది. పని పూర్తయిన తర్వాతనే ఇంటికెళ్తుంది.
ఈ 27ఏళ్ల లేడీ కానిస్టేబుల్ కి ఇంటిదగ్గర ఎవరూ లేరు. అందుకే పాపను తానే చూసుకోవాలి. లీవ్ లేదు. ఎక్కడికెళ్లినా పాపతోనే. ఉద్యోగం చేస్తున్నప్పుడు బేబీని చూసుకోవడం చాలా ఇబ్బంది. అయినా తప్పడంలేదని అంటోంది సంచిత రాణి.
ఆమె భర్త సెంట్రల్ రిజర్వ్ పోలీస్ లో అస్సాం బైట పనిచేస్తున్నాడు. సెలవులున్నప్పుడు మాత్రమే రాగలడు. తల్లితండ్రులు ఆమెతో ఉండలేరు. అందుకే కష్టమైన సరే, ఒకపక్క పాపను చూసుకొంటూనే ఉద్యోగం చేస్తోంది. ఆమె కోలిగ్స్ సహకరిస్తున్నారని రాణి అంటోంది.
పాప ఏడుస్తుంటే కొన్నిసార్లు ముందుగానే ఇంటికివెళ్లాల్సి ఉంది. ఈలోగా పనిని పూర్తిచేసుకొంటుందని, ఇది ఆమె నిబద్ధతని తోటి కానిస్టేబుల్స్ అంటున్నారు. కొందరు ఆ పాపను ఆడిస్తారుకూడా.