iDreamPost
iDreamPost
మూడు పోరుగు దేశాల నుండి వచ్చిన ముస్లిమేతర మైనారిటీ వలసదారులకు భారత పౌరసత్వం అందిస్తాం అంటు భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ చట్టం రాజ్యంగ విరుద్దంగా ఉందని దాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ నిరసన గళం వినిపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఈ చట్టం భారత లౌకికత్వంపై దాడుగా అభివ్రణించారు. ఇది ఇలా ఉంటే ఈ చట్టానికి వ్యతిరేకంగా ఏం.ఐ.యం అధ్యక్షుడు సుప్రీంకోర్టు తలుపు తట్టారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తు ఏం.ఐ.యం అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యంగ వ్యతిరేకమని అసదుద్దీన్ పిటీషన్ లో పెర్కొన్నారు. పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టినప్పుడు అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిల్లు ప్రతులను చింపేశారు. దక్షిణ ఆఫ్రికాలో ఇలాంటి వివక్షాపురిత బిల్లునే నాడు బ్రిటీష్ ప్రభుత్వం తెచ్చింది. ఇది ప్రజలను విడదీస్తుంది అంటూ గాంధీజీ ఆనాడు దానిని నిలువునా చింపి పారేశారు. ఆ తరువాతనే ఆయనని మహాత్ముడని కీర్తించటం మోదలెట్టారు. ఈ బిల్లు దేశంలోని ముస్లింలకు నిలువ నీడ లేకుండా చెస్తుంది. ఇందుకు నిరసనగా నేను కూడా ఈ బిల్లును చింపి పారేస్తున్నా అంటూ ఆ బిల్లు ప్రతిని చింపివేసిన విషయం తెలిసినదే.