iDreamPost
android-app
ios-app

Arjun Tendulkar: ఈ విమెన్ క్రికెట‌ర్ కోహ్లీకి పెళ్లి ప్ర‌పోజ‌ల్ చేసింది, ఇప్పుడు సచిన్ కొడుకుతో క్లోజ్

  • Published Jun 28, 2022 | 8:23 PM Updated Updated Jun 28, 2022 | 8:23 PM
Arjun Tendulkar: ఈ విమెన్ క్రికెట‌ర్ కోహ్లీకి పెళ్లి ప్ర‌పోజ‌ల్ చేసింది, ఇప్పుడు సచిన్ కొడుకుతో క్లోజ్

ఇంత‌వ‌ర‌కు ఐపీఎల్ ఆడ‌లేక‌పోయిన‌ ముంబై ఇండియన్స్‌ క్రికెటర్‌ అర్జన్‌ టెండూల్కర్ సోష‌ల్ మీడియాలో మ‌రోసారి పాపుల‌ర్ అయ్యాడు. ఇంగ్లండ్ స్టార్ విమెన్ క్రికెట‌ర్ డేనియల్ వ్యాట్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటో వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోల్లో అర్జున్‌, వ్యాట్‌తో కాస్త క్లోజ్ గానే ఉన్నాడు. కొంప‌తీసి ఇంగ్లీష్‌ పిల్ల బుట్టలో పడ్డాడా? ఇంట‌ర్నెట్ లో ఇదే డౌట్. ఫ్రెండ్లీగా ఉంటేచాలు, తప్పుగా కామెంట్లు చేస్తారా అంటూ మ‌రికొంద‌రు వాదిస్తున్నారు. ఈ క్రికెట‌ర్ మీడియాకు బాగానే తెలుసు. కొన్నేళ్ల క్రితం విరాట్ కోహ్లీని పెళ్లిచేసుకోమ‌ని అడిగింది. ఇప్పుడు అర్జున్ టెండూల్క‌ర్ తో చిల్ అవుతోంది. అందుకే ఈ ఫోట్ ఇంత‌ వైరల్ అయ్యింది?

టీం ఇండియా ప్రాక్టీస్ లో బౌలింగ్ చేసిన అనుభ‌వం అర్జున్ టెండూల్క‌ర్ కు ఉంది. ఇంగ్లాండ్ క్రికెట్ టీంకు, అలాగే విమెన్ క్రికెట్ టీంకూడా నెట్స్ లో బౌలింగ్ చేశాడు. ఇంగ్లాండ్ కు రెగ్యుల‌ర్ గా వెళ్లే అర్జున్, అక్క‌డి ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట‌ర్ల‌కి బౌలింగ్ చేస్తాడు. అంతెందుకు 2017 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆడిన ఇండియా విమెన్ టీంకు కూడా అర్జున్ బౌలింగ్ చేశాడు. జానీ బెయిర్ స్టో (Jonny Bairstow)కి యార్క‌ర్ వేస్తే, అత‌ను కింద‌ప‌డి గాయ‌ప‌డ్డాడు. ఇది జ‌రిగింది 2018లో. అప్పుడే ఇంగ్లాండ్ లో ఆడ‌టానికి వ‌చ్చిన‌ Indian teamకి, ఇంగ్లాండ్ విమెన్ టీంకుకూడా ప్రాక్టీస్ లో బౌలింగ్ చేశాడు. అప్పుడే డేనియల్ వ్యాట్ (Danielle Wyatt)తో అర్జున్ కు ప‌రిచ‌యం అయ్యింది. ఆమె అర్జున్ కి క్లోజ్ ఫ్రెండ్స్ లో ఆమె ఒక‌రు.

వ్యాట్‌ అర్జున్‌ తండ్రి సచిన్‌కు వీరాభిమాని. తండ్రి తనయులు ఎప్పుడు లార్డ్స్‌ మైదానానికి వచ్చినా ఆమె వారిని తప్పకుండా కలిసేది. త‌న‌కు బౌల్ చేయ‌మ‌ని అర్జున్ టెండూల్క‌ర్ ని రిక్వెస్ట్ చేసేదికూడా. మొద‌ట్లో మీడియం పేస్ తో బౌలింగ్ చేసే అర్జున్, ఆ త‌ర్వాత కాస్త స్పీడ్ పెంచాడు. అత‌ని బౌలింగ్ లో ఆడ‌టం చాలా క‌ష్ట‌మ‌ని వ్యాట్ మీడియాకు చెప్పిందికూడా. ఇప్ప‌టికీ రెగ్యుల‌ర్ గా అర్జున్ తో క్లోజ్ గానే ఉంటుంది.

వ్యాట్ వ‌య‌స్సు 31 ఏళ్లు. 93 వన్డేలు, 124 టీ20 ఆడింది. మొత్తం 4 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీలు కొట్టింది.మొత్తం 3400కు పైగా పరుగులు సాధించింది. బౌలింగ్ కూడా చేస్తుంది. హాఫ్‌ స్పిన్‌ బౌలర్‌. రెండు ఫార్మాట్లలో కలిపి 73 వికెట్లు సాధించింది.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap