iDreamPost
android-app
ios-app

ఫలించిన ఏళ్లనాటి కళ

ఫలించిన ఏళ్లనాటి కళ

ఏళ్ల తరబడి ఎదురుచుస్తోన్నఅర్చకుల కల తీరింది. దశాబ్దాలుగా పట్టించుకోని వారి వినతులను ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీర్చారు. దేశంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో ధూపదీప నైవేధ్య పథకం తెచ్చి ఆలయాల ఉన్నతికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృషి చేయగా, వేలాది అర్చకులకు తీరని కలగా ఉన్న వంశ పారంపర్య హక్కును భుక్తం చేస్తూ తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 

దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేస్తూ తరాలుగా పొట్ట పోసుకుంటున్న వేలాది అర్చకుల వంశ పారంపర్య హక్కును 1987లో అప్పటి ఎన్టీఆర్‌ సర్కారు రద్దు చేసింది. తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారి కష్టాలను తెలుసుకుని రద్దు చేసిన చట్టానికి 2007లో 34/3 పేరుతో చట్టాన్ని సవరిస్తూ అర్చుకులకు వంశ పారంపర్య హక్కుల పూర్వోధ్ధరణ కోసం  ఉత్తర్వులు తెచ్చారు. త్వరలో అర్చకుల సంక్షేమం కోసం ఉత్తర్వులు ఇవ్వాలనుకునే లోపు మత్యువు వారిని కబళించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వారు ఈ సవరణ ఉత్తర్వులను తొక్కిపెట్టారు. వంశ పారంపర్య హక్కులు కలిగివున్న అర్చకులకు కన్నీళ్లను వారు పట్టించుకోలేదు. 2017లో ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ ఇచ్చి, నెల రోజుల్లో చర్యలు చేపడతామని పక్కన పెట్టేసారు. 

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2007లో తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలో చేసిన చట్ట సవరణకు మరింతగా మెరుగులు దిద్ది, అర్చక సంక్షేమం, దేవాలయాల ఉన్నతిని కోరుతూ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ మన్మోహన్‌సింగ్‌ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో జిల్లాలో దాదాపు 90 శాతం ఆలయాల్లో పూజాదికాలు నిర్వహిస్తున్న వేలాది అర్చకులకు లబ్ది చేకూరనున్నది. ఈ ఉత్తర్వుల ప్రకారం దేవదాయ శాఖకు అనుబంధంగా ఉన్న ఆలయాలను మినహాయించి వంశపారంపర్యంగా హిందూ దేవాలయాల్లో పూజాదికాలు నిర్వహిస్తున్న వంశపారంపర్య అర్చకులు, మిరాశీదార్లకు లబ్ది చేకూరనున్నది. 

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş