iDreamPost
android-app
ios-app

యువ‌త న‌మ్మేది.. జ‌గ‌న్ నా, లోకేష్ నా?

యువ‌త న‌మ్మేది.. జ‌గ‌న్ నా, లోకేష్ నా?

వెయిట్ త‌గ్గించి, లుక్ మార్చి యువ‌త‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న లోకేష్.. యువ‌త ల‌క్ష్యంగానే రాజ‌కీయాల‌ను ప్రారంభించారు. అందుకు జాబ్ క్యాలెండర్ ను ఎంచుకున్నారు. వాస్త‌వానికి జాబ్ క్యాలెండ‌ర్ తెర‌పైకి తేవ‌డం ద్వారా ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌నం సృష్టించింది. ప‌క్క రాష్ట్ర తెలంగాణ‌ కూడా జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌ట‌న‌ను అనుస‌రించి ఉద్యోగ ప్ర‌ణాళికలు రూపొందించుకునే ప‌నిలో ఉన్నారు. అటువంటి త‌రుణంలో జాబ్ కేలండ‌ర్ కు వ్య‌తిరేకంగా లోకేష్ చేస్తున్న పోరాటం ఫ‌లిస్తుందా? అంటే కాద‌ని చెప్ప‌డంలో సందేహం అవ‌స‌రం లేదు.

ఎందుకంటే.. సచివాలయాల ఉద్యోగాలు, వ‌లంటీర్లు, ఎండీయూ ఆపరేటర్ల పేరుతో రేషన్ సరకుల పంపిణీ పోస్ట్ లు.. ఇలా లక్షలాది ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగుల కల నెరవేర్చారు జగన్. గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనన్ని పోస్ట్ ల్ని అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే భర్తీ చేశారు. ఒకేసారి ల‌క్ష‌న్న‌ర ఉద్యోగాలు ఇచ్చిన ఘ‌న‌త జ‌గ‌న్ ది. జాబు కావాలంటే బాబు రావాల‌న్న టీడీపీ.. ఏ జాబూ ఇక్క‌లేక‌పోయింది. అలాంటింది రెండేళ్ల‌లోనే యువ‌త‌కు సుమారు 4 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించి జ‌గ‌న్ యువ‌త మ‌దిలో నిలిచిపోయారు.

రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. అయితే, జాబ్ క్యాలెండర్ ప్రకటనలో ఏపీపీఎస్సీ భర్తీ చేసే పోస్ట్ లు తక్కువగా ఉన్నాయ‌ని, దీనివ‌ల్ల నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు లోకేష్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నారా లోకేష్ యధావిధిగా జాబ్ క్యాలెండర్ సమస్యలపై కూడా జూమ్ కాన్ఫరెన్స్ లు పెట్టారు. నిరుద్యోగులందరికీ జూమ్ కాన్ఫరెన్స్ లలో మాట్లాడుతూ వారికి

భరోసా కల్పిస్తున్నారు. టీఎన్ఎస్ఎఫ్ నేతలతో జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయిస్తున్నారు.

కానీ, లోకేష్ ఎన్ని చేస్తున్నా ఆయ‌నను ఏపీ యువ‌త ప‌ట్టించుకునే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. యువ‌త‌కు వేగంగా ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తున్న ఏకైక ముఖ్య‌మంత్రి జ‌గ‌న్. ఐదేళ్లు అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేద‌న్న గ‌త ప్ర‌భుత్వానికి భిన్నంగా ల‌క్ష‌లాది ఉద్యోగాలు క‌ల్పించ‌డ‌మే కాకుండా.. జాబ్ కేలెండ‌ర్ ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా నిరంత‌ర ఉద్యోగాల భ‌ర్తీకి జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్టారు. ఈ విష‌యాన్ని గ్ర‌హించి లోకేష్ వేరే అంశం ఎంచుకుంటే బెట‌ర్ అన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.