iDreamPost
android-app
ios-app

చింతామణి నాటకాన్ని ఎందుకు నిషేధించారు?

చింతామణి నాటకాన్ని ఎందుకు నిషేధించారు?

అరేయ్.. అన్నవరంలో రాత్రికి చింతామణి నాటకం వేస్తున్నారట.. ఇందాక ఆర్టీసీ బస్సు వెనుక పోస్టర్ చూశా. పోదామా..

ఎహే.. నాలుగు రోజులు ముందే కదరా నాగులాపల్లిలో వేస్తే వెళ్లి చూశాం.. మరీ అంత దూరం వెళ్లి చూడ్డం అవసరమా… చింతామణిని చూసేందుకు ఎంత దూరమైనా ఎల్లోచ్చహె..

అవును.. అప్పట్లో చింతామణి నాటకానికి అంత క్రేజ్ ఉండేది. ఆ మాటకొస్తే అప్పటికీ ఇప్పటికీ క్రేజ్ ఉన్న నాటకమే. హాస్య, శృంగార రసాలతో పాటుగా గొప్ప సందేశమూ అందులో ఉంటుంది. అయితే ఆ నాటికలోని ఓ పాత్ర.. ఓ వర్గానికి ఇబ్బంది గా ఉందనే వినతి మేరకు ఏపీ సర్కారు చింతామణి నాటకాన్ని నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన చింతామణి నాటకంపై జగన్ ప్రభుత్వం నిషేధం విధించింది. చింతామణి నాటకంపై ఇటీవలి కాలంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నాటకం తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, దీనిపై నిషేధం విధించాలని ఆర్య వైశ్య సంఘం నేతలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దీనిపై తక్షణం చర్యలు చేపట్టాలని సాంస్కృతిక శాఖను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఏడాది క్రితమే చింతామణి నాటకం ప్రదర్శనలను నిషేధించాలంటూ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారు. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం ఒక నోట్‌ జారీ చేసింది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత శాఖకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు ఆ నోట్‌లో సీఎంవో తెలిపింది. ఇకపై చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.

ఒకప్పుడు ‘చింతామణి’ ఈ నాటకం వేస్తున్నారంటే జనాలు ఎగబడేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఈ చింతామణి నాటకం ఓ ఊపు ఊపేసింది. తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చింతామణి నాటకం మొదటి ప్రదర్శన వేసి వందేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చింతామణి నాటకం శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి.
అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆ నాటక శతజయంతి వేడుకలపై తీవ్ర వివాదం నెలకొంది.చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని ఆర్యవైశ్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి. చింతామణి శతజయంతి వేడుకలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శతజయంతి పేరుతో నాటకాన్ని ప్రదర్శిస్తే ఉద్యమం చేస్తామని ఆర్య వైశ్యులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఆర్య వైశ్యుల మనోభావాలను కించపరుస్తూ చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. మాజీ సీఎం రోశయ్య హయాంలో చింతామణి నాటక ప్రదర్శన రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వారు చెబుతున్నారు. కాగా, చింతామణి నాటకంలో ‘సుబ్బిశెట్టి’ ప్రధాన పాత్ర. స్త్రీ వ్యామోహంలో పడి డబ్బు ఎలా పోగొట్టుకున్నాడో ఇందులో ఉంటుంది. అయితే ఈ పాత్ర ద్వారా తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆర్య వైశ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, చింతామణి నాటకాన్ని నిషేధిస్తుట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారు. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకం లీలాశుకచరిత్ర ఆధారంగా రచించారు. 1923 నాటికే సుమారు 446 సార్లు దేశమంతా ఈ నాటకాన్ని ప్రదర్శించారు. నాటకంలో సుబ్బి శెట్టి పాత్ర హైలెట్. ఇప్పుడు ఆ పాత్రే నాటకం నిషేధానికి కారణమైంది.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomjojobetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş