Venkateswarlu
అనిరుథ్ సినిమా అంటే థియేటర్ షేక్ అవ్వటం ఖాయం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ విధంగా ఉంటుంది. పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సంగీతం అందించిన ప్రతీ సినిమా పాటల పరంగా సూపర్ హిట్ అయింది.
అనిరుథ్ సినిమా అంటే థియేటర్ షేక్ అవ్వటం ఖాయం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ విధంగా ఉంటుంది. పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సంగీతం అందించిన ప్రతీ సినిమా పాటల పరంగా సూపర్ హిట్ అయింది.
Venkateswarlu
అనిరుథ్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మ్యూజిక్ అందిస్తున్నాడంటే చాలు సినిమా సక్సెస్ సగం ఖాయం అయిపోయినట్లే. అనిరుథ్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసి సినిమాను మరో లెవెల్‌కు తీసుకుపోతారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అనిరుథ్ తన సంగీతానికి గాను ఎన్నో నేషనల్.. ఇంటర్ నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నారు. పలు రికార్డులు కూడా సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు ఆయన ఖాతాలో మరో రికార్డు చేరిపోయింది. దేశ దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సరసన చోటు దక్కించుకున్నారు. ఇంతకీ సంగతేంటంటే.. అనిరుథ్.. సినిమాకు మ్యూజిక్ అందించడానికి కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటార్నన్న సంగతి తెలిసిందే. దేశంలో రెహమాన్ మాత్రమే రెండు డిజిట్ల నెంబర్ కలిగిన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఓ సినిమాకు దాదాపు 10 కోట్ల పైనే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. రెహమాన్ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి ఏ సంగీత దర్శకుడు చేరుకోలేదు.
అందరూ సింగిల్ డిజిట్ పారితోషికం తీసుకుంటున్నారు. అయితే, రెహమాన్ తర్వాత ఆ రికార్డును అనిరుథ్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు తమ సినిమా కోసం మొదటి ఛాయిస్‌గా అనిరుథ్ అనుకుంటున్నారు. ఆయన సంగీతం అందించిన సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్న నేపథ్యంలో.. అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వటానికి ఒప్పుకుంటున్నారు. దీంతో డబుల్ డిజిట్ అమౌంట్‌ను ఇస్తున్నారంట. కాగా, అనిరుథ్‌కు చిన్నప్పటినుంచి మ్యూజిక్ అంటే ఇష్టం. అందుకే పలు వాయిద్యాలను వాయించటం నేర్చుకున్నారు.
సినిమాల్లోకి రాకముందు బంధువైన ‘ఐశ్వర్య రజినీకాంత్’ తీసిన షార్ట్ ఫిల్మ్స్‌కు సంగీతం అందిస్తూ వచ్చారు. తర్వాత 2012లో వచ్చిన త్రీ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాకు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని ‘ వై దీస్ కొలవెరీ’ పాట ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాతోనే తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెండో సినిమాతోటే హిందీలోకి అడుగుపెట్టారు.
డేవిడ్ సినిమాలో ఓ పాటను మాత్రమే కంపోజ్ చేశారు. 2018లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూటర్న్, జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలకు సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయన దేవర, వీడీ 12 సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. అనిరుథ్ ఓ వైపు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూనే మరో వైపు పాటలు కూడా పాడుతున్నారు. తన సినిమాల్లోనే కాదు.. ఇతర సంగీత దర్శకుల సినిమాల్లోనూ పాటలు పాడుతున్నారు. అది కూడా ఎలాంటి పారితోషికం తీసుకోకుండా. మరి, అనిరుథ్ సాధించిన కొత్త రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.