iDreamPost
android-app
ios-app

హాట్‌ హాట్‌ వెబ్‌సిరీస్‌లో అమీ జాక్సన్‌

హాట్‌ హాట్‌ వెబ్‌సిరీస్‌లో అమీ జాక్సన్‌

అమీ జాక్సన్‌ మళ్ళీ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతోంది. ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్‌, కాస్త రెస్ట్‌ తీసుకుని, మాతృత్వాన్ని ఎంజాయ్‌ చేస్తూనే.. యాక్టింగ్‌ వైపు ఫోకస్‌ పెట్టిందట. డాన్స్‌లు, యోగా వంటివి సాధన చేస్తూ శరీరాన్నీ, మనసునీ ఫిట్‌గా వుంచుకున్నాననీ, తిరిగి సినిమాల్లో నటిస్తాననీ అంటోంది అమీ జాక్సన్‌. అయితే, సినిమాలకంటే ముందు అమీ జాక్సన్‌ పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్స్‌ ఇంకొన్ని వున్నాయి. అవే వెబ్‌ సిరీస్‌లు. కరోనా పాండమిక్‌కి ముందే అమీ జాక్సన్‌ కొన్ని వెబ్‌ సిరీస్‌లలో నటించాల్సి వుంది. అవన్నీ ఇప్పుడు పట్టాలెక్కబోతున్నాయట. త్వరలోనే ఓ ఇంట్రెస్టింగ్‌ వెబ్‌సిరీస్‌ ద్వారా ప్రేక్షకుల్ని పలకరిస్తానంటోంది అమీ జాక్సన్‌. కొంచెం హాట్‌గా ఆ వెబ్‌ సిరీస్‌ వుంటుందనీ, అయితే అందులో మంచి మెసేజ్‌ కూడా వుంటుందని అమీ జాక్సన్‌ చెప్పింది. ఇంగ్లీష్‌లో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌ని, హిందీ అలాగే తమిళ, తెలుగు భాషల్లోకీ డబ్‌ చేసే అవకాశం వుందట. సినిమాల విషయానికొస్తే, బాలీవుడ్‌లో ఓ సినిమా చేయాల్సి వుందట అమీ జాక్సన్‌. ఓ ప్రముఖ హీరో నటిస్తున్న సినిమా అట అది. అయితే, ఆ వివరాల్ని చెప్పడానికి అమీ జాక్సన్‌ నిరాకరించింది. తమిళంలో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నానని మాత్రం వెల్లడించింది. అమీ జాక్సన్‌ తెలుగులో ‘ఎవడు’ సినిమాలో నటించిన విషయం విదితమే. తమిళంలో ‘ఐ’, ‘2.0’ తదితర సినిమాల్లో నటించింది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet