iDreamPost
android-app
ios-app

18 నెలలోనే ఉత్పత్తి – ఆంధ్ర పారిశ్రామిక ప్రగతి

18 నెలలోనే ఉత్పత్తి – ఆంధ్ర పారిశ్రామిక ప్రగతి

మొదటి వేవ్ కరోనా విజృంభణ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు వందలాది మంది ఇంజనీరింగ్ నిపుణులకు ఉద్యోగావకాశాలు తెచ్చిపెట్టింది. అసలు ఏపీలో ఎలాంటి పెట్టుబడులు లేవు అంటూ ప్రతిపక్ష టీడీపీ సహా కొన్ని పార్టీలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నా ప్రచారం కోసం పాకులాడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం తమ పని చేసుకుంటూ వెళుతోంది. ఇక అమెరికాకు చెందిన ఆంఫినాల్ సంస్థ – ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ లిమిటెడ్ (ఏఎంటీజెడ్‌) మధ్య 18 జులై 2020లో ఎంవోయూ కుదిరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కంపెనీ విశాఖపట్నంలో తమ ఆపరేషన్స్ ప్రారంభించింది.

అధునాతన వైద్య పరికరాల తయారీకోసం సుమారు కొన్ని కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి ఆంఫినాల్ ఏపీలో తమ ఆపరేషన్స్ ప్రారంభించింది. ఇప్పటికే సిద్దమైన ఈ కంపెనీ ఆపరేషన్స్ ప్రారంభం కావడంతో వందలాది మంది శాస్త్రవేత్తలు, మెడికల్, ఫార్మా, ఇంజనీరింగ్ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఆంఫినాల్ సంస్థకి వైద్య పరికరాల తయారీలో 70 ఏళ్ల అపార అనుభవముంది.

మనిషి శరీరంలో భౌతిక మార్పులకు సంబంధించిన ఉష్ణోగ్రత, ప్రాణ వాయువు ఆక్సిజన్, హ్యుమిడిటీ, ఒత్తిడి వంటి వాటి స్థాయిలను కొలిచి, నిర్ధారించే పరికరాల రూపకల్పనలో ఈ సంస్థకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కరోనా ఇంకా ఎన్ని వేరియంట్లు పుట్టుకువస్తాయో? అవి ఇంకెంత దారుణంగా ఉంటాయో తెలియని ప్రస్తుత తరుణంలో ఇలాంటి వైద్యపరికరాల తయారీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల చాలా అవసరమనే చెప్పాలి.

Also Read : శ్రీసిటీ నుంచి ఆక్సిజన్‌

Jojobet GirişmeritbetholiganbetCasibom girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetcasibom girişzlot girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/pokerklascasibomholiganbet girişholiganbet girişMarsbahis GüncelMarsbahis Güncel GirişHoliganbet GirişHoliganbet Güncel GirişMarsbahis GirişMarsbahis Güncel Giriş