Swetha
బుల్లి తెర ప్రేక్షకులను మొన్నటి వరకు అలరించింది తెలుగు బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 7 పలు వివాదాల మధ్యన విజయవంతంగా ముగిసింది. అయితే, ఈ సీజన్ లో రన్నర్ గా నిలిచిన అమరదీప్.. తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బుల్లి తెర ప్రేక్షకులను మొన్నటి వరకు అలరించింది తెలుగు బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 7 పలు వివాదాల మధ్యన విజయవంతంగా ముగిసింది. అయితే, ఈ సీజన్ లో రన్నర్ గా నిలిచిన అమరదీప్.. తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Swetha
ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన తర్వాత.. వారి అభిమానులు సృష్టించిన విధ్వసం గురించి అందరికి తెలిసిందే. ఈ సీజన్ లో విన్నర్ ,రన్నర్ ఫ్యాన్స్ కు మధ్యన భారీ వాగ్వాదమే జరిగింది. ఈ క్రమంలో రన్నర్ గా నిలిచిన అమర్ దీప్ పైన పలు దాడులు కూడా జరిగాయి. అమర్ తో పాటు పలు సెలెబ్రిటీల కార్లపైన, పబ్లిక్ ప్రాపర్టీపైన కూడా.. ఫ్యాన్స్ దాడులు చేశారు. అయితే, కొంత సమయానికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో.. గొడవలు సర్దుమణిగాయి. ఆ సమయంలో ఈ విషయంపైన చాలా మంది విమర్శలు కురిపించారు. ఇక అమర్ దీప్ కూడా తన పైన జరిగిన దాడిపై స్పందిస్తూ మీడియాతో మాట్లాడాడు. ఆ తర్వాత అమర్ ఎక్కడా కనిపించలేదు. ఇక తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అమర్ ఈ విషయాలపై తన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇంతవరకు బిగ్ బాస్ అంటే.. అందులో పాల్గొన్న వ్యక్తుల గురించి, ఆటగాళ్ల గురించి, విన్నర్ , రన్నర్ గురించి ఇలా కొంతమంది గురించి చర్చించేకునేవారు ప్రజలు. కానీ లాస్ట్ సీజన్ బిగ్ బాస్ అంటే మాత్రం ఫినాలే ఎపిసోడ్ రోజు.. ఫ్యాన్స్ మధ్యన జరిగిన వివాదాలే గుర్తొస్తాయి. సహజంగానే బిగ్ బాస్ లోకి వెళ్లే ఆటగాళ్లకు బయట ప్రొమోషన్స్ జరుగుతూ ఉంటాయి. వారికంటూ ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఫ్యాన్స్ మధ్యన సామజిక మాద్యమాలలో చిన్న చిన్న వార్ జరుగుతూ ఉంటుంది. ఇది కొత్తేమీ కాదు. అయితే, ఈసారి జరిగిన సీజన్ లో మాత్రం ఈ ఫ్యాన్ వార్స్ కొంచెం ఎక్కువే జరిగాయి. ఆ విమర్శలు వారి అభిమాన ఆటగాడి ఇంటి గుమ్మం వరకు చేరాయి. ముఖ్యంగా అమర్ దీప్ కుటుంబ సభ్యులు ఈ వేధింపులకు ఎక్కువగా గురి అయ్యారు. బిగ్ బాస్ ఆట కొనసాగుతున్న సమయంలోనే అమర్ దీప్ కుటుంబ సభ్యులపైన కొంతమంది అసభ్యకరమైన కామెంట్స్ చేయగా.. అమర్ తల్లి దానిపై ఘాటుగానే స్పందించారు. ఈ విషయాలపై తాజాగా అమర్ దీప్ స్పందిస్తూ ఓ ఇంటర్వ్యూలో ఇలా పేర్కొన్నారు.
“నా గురించి ఎంతైనా నెగటివ్ గా స్ప్రెడ్ చేయండి. నేను అవేం పట్టించుకోను. కానీ, ఆడవాళ్ళను వీటిలో ఇన్వాల్వ్ చేయకండి. మీ ఇళ్లలో కూడా ఆడవాళ్లు ఉన్నారని మర్చిపోయి.. విచక్షణ రహితంగా ప్రవర్తించారు. ఒక తల్లికి, భార్యకు, స్నేహితురాలికి పెట్టకూడని అసభ్యకరమైన ఫోటోలను పెట్టారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి అమ్మాయికి ఇలానే పెట్టారు. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. నాతో ప్రాబ్లమ్ ఉంటే రండి మనం మాట్లాడుకుందాం. మీ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారని గుర్తుపెట్టుకోండి “. అంటూ అమర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఏదేమైనా ఫ్యాన్ వార్స్ అనేవి వారి అభిమాన సెలెబ్రిటీల.. ఇంటి గడప తొక్కనంతవరకు మాత్రమే ఆసక్తికరంగా ఉంటాయి. ఆ తర్వాత అవి హద్దులు దాటితే వారి కుటుంబ సభ్యుల మనోవేదనకు కారణాలుగా మిగిలిపోతాయి. మరి, అమర్ దీప్ తన కుటుంబ సభ్యుల విషయంలో వ్యక్తపరిచిన విషయాలపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.