iDreamPost
android-app
ios-app

నిండు గర్భిణీగా ఉన్నాఅమలా పాల్ డ్యాన్స్! కారణం ఏమిటంటే?

  • Published Jun 08, 2024 | 7:16 PM Updated Updated Jun 08, 2024 | 7:16 PM

Amala Paul: ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అమలా పాల్ ఓ బిడ్డను కనేందుకు సిద్ధంగా ఉంది. అలాగే రేపో మాపో ఆ బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడబోతుంది. ఇలాంటి సమయంలో తాజాగా అమలా పాల్ తాజాగా కౌంట్ డౌన్ స్టార్ట్ అనే ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Amala Paul: ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అమలా పాల్ ఓ బిడ్డను కనేందుకు సిద్ధంగా ఉంది. అలాగే రేపో మాపో ఆ బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడబోతుంది. ఇలాంటి సమయంలో తాజాగా అమలా పాల్ తాజాగా కౌంట్ డౌన్ స్టార్ట్ అనే ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Jun 08, 2024 | 7:16 PMUpdated Jun 08, 2024 | 7:16 PM
నిండు గర్భిణీగా ఉన్నాఅమలా పాల్ డ్యాన్స్! కారణం ఏమిటంటే?

హీరోయిన్ ‘అమలా పాల్’.. ఈమె గురించి ప్రత్యకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు.ఇకపోతే పేరుకు మాలీవుడ్ బ్యూటీ అయిన అమలా.. ఇటు టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అందరికీ సుపరిచితమే ముఖ్యంగా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది ఈ అమ్మాడు. ఈ క్రమంలోనే.. అమలా పాల్ మంచి ఫ్యాన్ పాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. అమలా గతేడాది తన ప్రియుడు గుజరాత్ కు చెందిన జగత్ దేశాయ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఇక అక్కడకి కొన్ని రోజుల తర్వాత తమ జీవితంలో మరో వ్యక్తి రాబోతున్నారంటూ.. అమలా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఇక ఈ విషయం తెలుసుకున్న అమలా ఫ్యాన్స్ ఈ జంటకు పెద్ధ ఎత్తునే శుభకాంక్షలు తెలిపారు. అలాగే తన ప్రెగ్నెన్సీ శుభవార్తను బయటపెట్టిన నుంచి ఈ ముద్దుగుమ్మ వరుసగా సోషల్ మీడియాలో తన బేబీ బంప్ తో ఫోటోస్ తో దర్శనమిస్తుంది. అలాగే ఇటీవలే అమలా తన స్రీమంత వేడుకలను కూడా ఘనంగా జరిపించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ తన కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ.. ఓ ఆసక్తికర వీడియోలను షేర్ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అమలా పాల్ ఓ బిడ్డను కనేందుకు సిద్ధంగా ఉంది. అలాగే రేపో మాపో ఆ బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడబోతుంది. ఇలాంటి సమయంలో తాజాగా అమలా పాల్ తాజాగా కౌంట్ డౌన్ స్టార్ట్ అనే ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేసింది. కాగా, ఆ వీడియోలో అమాల్ పాల్ చూస్తే.. ఇప్పటికే తొమ్మిది నెలలు నిండినట్టుగా కనిపిస్తోంది.  ‘బిడ్డ బయటకు వచ్చేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్’ అంటూ .. అమలా పాల్ ఓ క్యూట్  వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇక ఆ వీడియోలో అమలా పాల్ డ్యాన్స్ చేస్తూ.. తన పొట్టను ఊపేస్తూ కనిపిస్తుంది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను చూసి నెటిజన్స్ ఒక్కొక్కరూ ఒకో విధంగా స్పందిస్తూన్నారు. అలాగే అమలా పాల్ త్వరలోనే ఆడబిడ్డ పుడుతుందంటూ.. కామెంట్స్ పెడుతున్నారు. మరి కొందరు ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోతూ.. ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అమలా పాల్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ఆమె పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పైగా కడుపుతో ఉన్నా కూడా ఈ సినిమాకు అమలా పాల్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది. ఆ మూవీ కేరళలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలా అమలా పాల్‌కు మరో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమాలా పాల్ లేటెస్ట్ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)