iDreamPost
iDreamPost
అల్లు అర్జున్ మద్యం బ్రాండ్‌ను ప్రచారం చేయడం కోసం కనీసం 10 కోట్ల రూపాయల డీల్‌ను కాదన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే బ్రాండ్ ల విషయంలో అల్లు అర్జున్ నిక్కచ్చిగా ఉంటున్నారు. ఇంతకుముందు పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించారు.
అల్లు అర్జున్ ఏం చేసినా ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకొంటారు. బ్రాండ్ విషయాల్లోనూ అంతే. ఎలాంటి బ్రాండ్ లకు అంబాసిడర్ గా ఉండాలో పుష్ప హీరో తీసుకొనే నిర్ణయం నెటిజన్స్ హృదయాలను గెలుచుకుంది. కొన్ని నెలల క్రితం, అల్లు అర్జున్ పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలంటూ వచ్చిన ప్రపోజల్ ను తిరస్కరించారు. భారీ మొత్తంలో ఆఫర్ చేశారు. అయినా పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి నిరాకరించాడు. ఇప్పుడు లిక్కర్ బ్రాండ్‌ను ప్రచారం చేయడానికి కోట్లాది రూపాయల ఒప్పందాన్ని తిరస్కరించారు. బాలీవుడ్ స్టార్లు ఇప్పటికీ పాన్ మసాలా, లిక్కర్ బ్రాండ్ ల ప్రమోషన్ కోసం కోట్ల రుపాయిలను తీసుకొంటుంటే, అల్లు అర్జున్న మాత్రం వాటికి నో చెప్పారు.
కాలమిస్ట్ , ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రాకర్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు. మద్యం, పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి వచ్చిన ఆఫర్ విలువ ఒక్కొక్కటి రూ. 10 కోట్లు. అయినా కాదన్నారు. ఫ్యామిలీ హీరోగా తనకున్న ఇమేజ్‌కి కట్టుబడి ఉన్నాడు. పాన్ ఇండియన్ హీరోగా తనకున్న సెలబ్రిటీ వాల్యూ ఏంటో ఆయనకు తెలుసు. జవాబుదారితనాన్ని వదిలిపెట్టలేదు. సొసైటీకి హానిచేసే, మత్తు ఉత్పత్తుల ప్రచారానికి దూరం. ఇదేసమయంలో, అల్లు అర్జున్ రెండు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లకు సైన్ అప్ చేసాడు. అవన్నీ రెగ్యులర్ బ్రాండ్ లే. బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి అల్లు అర్జున్ ఛార్జీ చాలా ఎక్కువ. ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కోసం అల్లు అర్జున్ 7.5 కోట్లు వసూలు చేస్తున్నాడన్నది విజయబాలన్ మాట. ట్వీట్ చూడండి:
#AlluArjun denied a ₹10 cr offer from gutka and liquor brand.
Currently he is charging ₹7.5 cr for brand endorsements.
Kudos to the star for following his principles.
— Manobala Vijayabalan (@ManobalaV) August 10, 2022
గతంలో షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రచారం చేసినందుకు ట్రోల్ అయ్యారు. అంతెందుకు, పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రమోట్ చేసినందుకు మహేష్ బాబును కూడా ఆడియన్స్ విమర్శించారు. సొసైటి పట్ల బాధ్యత ఉండక్కర్లేదా? అని క్వశ్చన్ చేశారు. నిజానికి సౌత్ స్టార్లు పాన్ మసాలా ప్రొడెక్ట్స్ ప్రమోషన్ కి చాలా దూరం. కెజిఎఫ్ స్టార్ యష్ గతంలో పాన్ మసాలా బ్రాండ్ ప్రమోషన్‌ను తిరస్కరించారు. ఇప్పుడు, అల్లు అర్జున్ . ఐకాన్ స్టార్ ని చూసి అభిమానులు గర్వపడుతున్నారు. మద్యం, పాన్ మసాలాను ప్రోత్సహించడానికి రూ. 10 కోట్ల ఒప్పందాన్ని కాదన్న అల్లు అర్జున్ నిర్ణయం మీద ఫ్యాన్స్ పాజిటీవ్ గా రియాక్ట్ అవుతున్నారు.