iDreamPost
android-app
ios-app

పుష్ప 2 రిలీజ్ సమయంలో బన్నీ పై కేసు నమోదు

  • Published Nov 30, 2024 | 4:54 PM Updated Updated Nov 30, 2024 | 4:54 PM

ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 ఫీవర్ వైల్డ్ ఫైర్ లా పాకేస్తుంది. ఈ సినిమా చూడడం కోసం కొన్ని లక్షల మంది అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటు మూవీ షూటింగ్ పనులు కంప్లీట్ చేసుకుని.. సెన్సార్ కూడా పూర్తయిపోయింది. ఇంకా నాలుగు రోజుల్లో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం.ఇక సినిమా రిలీజ్ అవ్వడమే లేట్ అనుకునే సమయానికే.. అల్లు అర్జున్ ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. అల్లు అర్జున్ కి భారీ షాక్ తగిలింది. అల్లు అర్జున్ అభిమాన సంఘానికి పెట్టుకున్న పేరు.. కొత్త సమస్య తెచ్చిపెట్టింది.

ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 ఫీవర్ వైల్డ్ ఫైర్ లా పాకేస్తుంది. ఈ సినిమా చూడడం కోసం కొన్ని లక్షల మంది అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటు మూవీ షూటింగ్ పనులు కంప్లీట్ చేసుకుని.. సెన్సార్ కూడా పూర్తయిపోయింది. ఇంకా నాలుగు రోజుల్లో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం.ఇక సినిమా రిలీజ్ అవ్వడమే లేట్ అనుకునే సమయానికే.. అల్లు అర్జున్ ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. అల్లు అర్జున్ కి భారీ షాక్ తగిలింది. అల్లు అర్జున్ అభిమాన సంఘానికి పెట్టుకున్న పేరు.. కొత్త సమస్య తెచ్చిపెట్టింది.

  • Published Nov 30, 2024 | 4:54 PMUpdated Nov 30, 2024 | 4:54 PM
పుష్ప 2 రిలీజ్ సమయంలో బన్నీ పై కేసు నమోదు

ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 ఫీవర్ వైల్డ్ ఫైర్ లా పాకేస్తుంది. ఈ సినిమా చూడడం కోసం కొన్ని లక్షల మంది అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటు మూవీ షూటింగ్ పనులు కంప్లీట్ చేసుకుని.. సెన్సార్ కూడా పూర్తయిపోయింది. ఇంకా నాలుగు రోజుల్లో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం. మరో వైపు ప్రమోషన్స్ పనులు చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. అన్ని రాష్ట్రాలను కవర్ చేస్తూ.. రాష్ట్రానికో వ్యూహాన్ని అమలు చేస్తూ మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది.. ఇక సినిమా రిలీజ్ అవ్వడమే లేట్ అనుకునే సమయానికే.. అల్లు అర్జున్ ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. అల్లు అర్జున్ కి భారీ షాక్ తగిలింది. అల్లు అర్జున్ అభిమాన సంఘానికి పెట్టుకున్న పేరు.. కొత్త సమస్య తెచ్చిపెట్టింది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళింది. అల్లు అర్జున్ అభిమానులు .. తమ అభిమాన సంఘానికి పెట్టుకున్న పేరు ‘అల్లు అర్జున్ ఆర్మీ’…ఇప్పుడు ఈ పేరుపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు కంప్లైంట్ వెళ్ళింది.

ఈ పేరు పెట్టుకోవడంపై గ్రీన్ పీస్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ.. అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్మీ అంటే దేశానికీ సేవ చేసే ఓ గౌరవ ప్రధానమైన పేరు అని.. దేశ భద్రతకు సంబంధించిన అంశం అని.. ఈ సంస్థ వాపోయింది. ఇంత గొప్ప ఆర్మీ పేరును అల్లు అర్జున్ ఆర్మీ అని ఎలా పెట్టుకుంటారని.. అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై కేసు నమోదు చేయాలనీ.. హైదరాబాద్‌లోని జవహర్ నగర్ సీఐ ను కోరుతూ కంప్లైంట్ చేశారు. ఆర్మీ అంటే ఒక జాతీయ సమగ్రత , జాతీయ భద్రత కు సంబంధించిన విషయమని.. కానీ అల్లు అర్జున్ ఇప్పటికి చాలా సార్లు తనకు అల్లు ఆర్మీ ఉందని ప్రకటించరాని ఆ సంస్థ అధ్యక్షులు చెప్పుకొచ్చారు. దీనితో జవహర్ నగర్ పోలీసులు కూడా ఈ కేసును పరిగణలోకి తీసుకుని.. పరిశీలిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు అల్లు అర్జున్ కానీ.. అటు అల్లు అర్జున్ అభిమానులు కానీ రెస్పాండ్ అవ్వలేదు.

అల్లు అర్జున్ ఆర్మీ అనే పేరు ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉంది. కానీ సరిగ్గా ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ టైం లో నే ఈ వివాదం బయటకు రావడం అనేది అందరిని ఆలోచింపజేస్తుంది. ఆర్మీ అనే పదం చాలా గౌరవ ప్రదమైనదే దానిని ఎవరు కించపరచలేదు. అయితే చాలా సార్లు చాలా సెలెబ్రిటీల విషయంలో వారి వారి అభిమానులు ఇలాంటి ఆర్మీ ట్యాగ్ ను పెట్టుకున్నారు. కానీ ఇప్పటివరకు ఇలాంటి వివాదం ఎప్పుడు తెరమీదకు రాలేదు. మరి ఇప్పుడు కేవలం అల్లు అర్జున్ విషయంలోనే ఇది బయటకు రావడం గమనార్హం. ఇక అల్లు అర్జున్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఎలా స్పందిస్తారో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis