iDreamPost
android-app
ios-app

ర‌జ‌నీ.. మ‌రో మూడు రోజుల్లో ఏం ప్ర‌క‌టించ‌బోతున్నారు..?

ర‌జ‌నీ.. మ‌రో మూడు రోజుల్లో ఏం ప్ర‌క‌టించ‌బోతున్నారు..?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌మిళ‌నాడులోనే కాదు దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ ఏర్ప‌డింది. ‘‘నేను రాజకీయాల్లోకి వస్తున్నా. సొంతంగా పార్టీ పెడతా. రాబోయే శాసనసభ ఎన్నికల్లో 234 స్థానాల్లో నా పార్టీ పోటీ చేస్తుంది’’ అని రజనీకాంత్ 2017 చివ‌ర్లో కూడా ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచీ అదిగో పార్టీ, ఇదో పార్టీ ర‌జ‌నీ రాజ‌కీయ ప్ర‌వేశంపై ఊహాగానాలు వెలువ‌డుతూనే ఉన్నాయి. స‌రిగ్గా మూడేళ్ల‌కు మ‌ళ్లీ 2020 చివర్లోనే మ‌రోసారి ట్విట్ట‌ర్ వేదిక‌గా ర‌జ‌కీకాంత్ పార్టీ గురించి ప్ర‌క‌టించారు. జ‌న‌వ‌రిలో రాజ‌కీయ పార్టీ పెడ‌తాన‌ని, డిసెంబ‌ర్ 31న పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని చెప్పారు. అప్ప‌టి నుంచీ పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండ‌గానే.. అనూహ్యంగా ఆయ‌న అనారోగ్యానికి గుర‌య్యారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో మ‌రో మూడు రోజుల్లో ఆయ‌నేం ప్ర‌క‌టిస్తార‌నేది స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది.

రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన కొద్ది రోజుల‌కే ర‌జ‌నీ అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డం ఆయ‌న అభిమానుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. 70 ఏళ్ల వ‌య‌సులో పార్టీ పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌లైవా.. రాజ‌నీయాల్లో ఎలా రాణిస్తార‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. వ‌య‌సు భారం, అనారోగ్యం వంటి కార‌ణాల నేప‌థ్యంలో రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌ను ఎదుర్కొంటారో చూడాలి. డిశ్చార్జి చేసే స‌మ‌యంలో బాగా విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్య‌లు సూచించారు. ఈ క్ర‌మంలో ర‌జ‌నీ స్పంద‌న ఎలా ఉంంటుందో చూడాలి. ‘నేను ఎప్పుడు వస్తానో, ఎలా వస్తానో ఎవరికీ తెలియదు… కానీ రావాల్సిన సమయానికి వచ్చేస్తా’ అంటూ చెప్పిన మాణిక్యం అలియాస్ రాజ‌నీ రాజకీయాల్లోకి వస్తారో లేదో అని ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంద‌రో అనుమానాలు వ్య‌క్తం చేశారు. వారి అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ ప్ర‌క‌ట‌న అయితే వ‌చ్చింది కానీ.. అది ఎంత వ‌ర‌కు కార్య‌రూపం దాల్చుతుందో అనేది మ‌రో మూడు తెలియ‌నుంది.

అవినీతి, కుట్రలు, కుతంత్రాలు అధికంగాగల తమిళ రాజకీయాలలో రజనీ నిల దొక్కుకోగలరా? హీరోగా రజనీని అభిమానించేవాళ్లు ఆయనపై రాజకీయ నాయకునిగా అంత అభిమానం చూపుతారా? అన్నది అత్యంత కీలకం. మన తెలుగునాట మెగాస్టార్‌ రాజకీయ పార్టీ పెట్టి రాణించలేక పోయారు. ఆయ‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌స్తుతం అలానే ఉంది. దేశంలో సినీ రంగం నుంచి వచ్చిన వారిలో ఎన్టీఆర్, ఎంజీఆర్‌లు మాత్రమే సక్సెస్‌ అయ్యారని, ఇప్పుడు ఆ రంగం నుంచి వచ్చిన పవన్‌ కల్యాణ్, వస్తున్న రజనీకాంత్‌లు ఇద్దరూ రాణించలేరని సీపీఐ నారాయ‌ణ లాంటి వారు ఇప్ప‌టికే స్టేట్ మెంట్ లు ఇచ్చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీ ఏం చెబుతారో చూడాలి మ‌రి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş