iDreamPost
android-app
ios-app

AIADMK అన్నాడీఎంకేకి ఒక్క‌రే బాస్, పార్టీ నుంచి OPS బహిష్కరణ

  • Published Jul 11, 2022 | 1:46 PM Updated Updated Dec 18, 2023 | 5:41 PM

పార్టీపై ప‌ట్టు సాధించిన ఈపీఎస్, IADMK తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చేప‌ట్టారు. జంట నాయకత్వ వ్యవస్థకు స్వస్తి ప‌లికారు.

పార్టీపై ప‌ట్టు సాధించిన ఈపీఎస్, IADMK తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చేప‌ట్టారు. జంట నాయకత్వ వ్యవస్థకు స్వస్తి ప‌లికారు.

AIADMK అన్నాడీఎంకేకి ఒక్క‌రే బాస్, పార్టీ నుంచి OPS బహిష్కరణ

డీఎంకేతో OPS సంబంధాలున్నాయి. అందుకే చ‌ర్య తీసుకున్నాం. పార్టీ బహిష్కరణ తర్వాత ఓ పన్నీర్ సెల్వం (OPS)పై కొత్త అన్నాడీఎంకే(IADMK) బాస్, ఇ పళనిస్వామి (ఇపిఎస్) దాడి మొద‌లుపెట్టారు. పార్టీపై ప‌ట్టు సాధించిన ఈపీఎస్, IADMK తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చేప‌ట్టారు. జంట నాయకత్వ వ్యవస్థకు స్వస్తి ప‌లికారు.

డిఎంకె ప్రభుత్వంతో ఒపిఎస్ అంట‌కాగుతున్నాడ‌ని, పార్టీ డాక్యుమెంట్లు, సామాగ్రిని ఆయన ఎత్తుకెళ్లార‌ని ఆరోపించారు. పోలీసుల‌ను కోరినా, అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి భ‌ద్ర‌త క‌ల్పించ‌లేద‌ని అన్నారు.

కొన్ని వారాలుగా అన్నాడీఎంకే పార్టీలో నాయ‌క‌త్వం కోసం, ఇద్ద‌రు అటూ ఇటూ పార్టీని లాగుతున్నారు. ఓపీఎస్ మీద మాజీ సీఎం పైచేయిసాధించ‌గానే, వేగంగా వ్యూహాలు మార్చేశారు. 2,500 కంటే ఎక్కువ మంది సభ్యులతో ఉన్న పార్టీ జనరల్ కౌన్సిల్, EPS కు ద‌న్నుగా నిల‌బ‌డింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పునరుద్ధరించి, కోఆర్టినేటర్, సంయుక్త కోఆర్డినేటర్ పోస్టులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్ప‌టిదాకా ఈ రెండు ప‌దవుల‌ను, OPS, EPSలు నిర్వ‌హించారు.
AIADMK is the only boss of AIADMK, OPS is expelled from the party
ఇదే అదునుగా “పార్టీ వ్యతిరేక” కార్యకలాపాల‌కు OPSను బ‌హిష్క‌రించారు. అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్‌ సెల్వాన్ని తొలగించాలని ఎమ్మెల్యే నాథం విశ్వనాథన్‌ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఓపీఎస్ ను పార్టీ ముఖ్య పదవులు, సభ్యత్వం నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ తీర్మానించింది. అక్క‌డితో ఆగ‌లేదు. ఓపీఎస్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఓపీఎస్‌ మద్దతుదారులపైనా బహిష్కరణ వేటు పడింది. ఓపీఎస్‌తోపాటు వైతిలింగం, జేసీడీ ప్రభాకర్, పీహెచ్ మనోజ్ పాండియన్ లాంటి కీల‌క నేత‌లు బహిష్కరణకు గురయ్యారు.

ప్రధాన కార్యదర్శి పదవి ఎన్నికలు జరిగే వరకు మధ్యంతర ఏర్పాటుగా తాత్కాలిక ప్ర‌దాని కార్య‌ద‌ర్శి ప‌ద‌విని ఈపీఎస్ చేప‌ట్టారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఆయ‌నే పార్టీ బాస్ కావ‌డం ఖాయం. దీంతో పార్టీ పగ్గాలు పూర్తిగా పళనిస్వామి చేతులోకి చేరాయి.

2016 డిసెంబరులో దివంగ‌త‌ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత, ఓపీఎస్, ఈపీఎస్ లు పార్టీ నాయ‌కత్వం కోసం పోటీప‌డ్డారు. బీజేపీ చొర‌వ‌తో ఇద్ద‌రూ సర్దుకుపోయారు. ఇద్ద‌రికీ పార్టీపై స‌మాన హ‌క్కులుండేలా ఎర్పాటు జ‌రిగింది. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో డీఎంకె గెల్చింది. ఎన్నాడీఎంకె తుడిచిపెట్టుకుపోతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కాని, ఈపీఎస్ నాయ‌కత్వంలో అన్నాడీఎంకే స్టాలిన్ కు గ‌ట్టిపోటీ ఇచ్చింది. అందుకే పార్టీ నిల‌బ‌డింది. ఆ త‌ర్వాత కూడా అంత‌ర్యుద్ధం కొన‌సాగింది. చివ‌ర‌కు ఈపీఎస్ విజేత‌గా నిల్చారు.

తనను 1.5 కోట్ల మంది పార్టీ కార్యకర్తలు సమన్వయకర్తగా ఎన్నుకున్నారని, తనను బహిష్కరించే హక్కు ఈపీఎస్‌కు లేదా మరో నాయకుడికి లేదని అన్నారు. “నేను ప్రాథమిక సభ్యత్వం నుంచి వారినే బహిష్కరిస్తున్నాను” అని ఓపీఎస్ ప్ర‌క‌టించారు. కాని, ఇప్ప‌టికే ప‌రిస్థితి చేయిదాటిపోయింది. ఇప్పుడున్న రాజ‌కీయ‌ప‌రిస్థితుల్లో ఓపీఎస్ రాజ‌కీయంగా దెబ్బ‌తిన్న‌ట్లేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.