iDreamPost
android-app
ios-app

లోకల్ యాప్ మెగా దూకుడు

  • Published Jul 04, 2021 | 4:22 AM Updated Updated Jul 04, 2021 | 4:22 AM
  • Published Jul 04, 2021 | 4:22 AMUpdated Jul 04, 2021 | 4:22 AM
లోకల్ యాప్ మెగా దూకుడు

ఓన్లీ తెలుగు కంటెంట్ ట్యాగ్ తో ఎంట్రీ ఇచ్చి మొదట్లో తడబడిన అల్లు వారి ఆహా యాప్ ఈ ఏడాది నుంచి చాలా దూకుడు మీద ఉంది. ఎప్పుడైతే క్రాక్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుందో అప్పటి నుంచి వరసగా క్రేజీ సినిమాలతో పాటు ఇండిపెండెంట్ మూవీస్ మీద ఫోకస్ పెట్టింది. లాక్ డౌన్ టైంలో థాంక్యూ బ్రదర్ తో పాటు అర్ధ శతాబ్దంని డైరెక్ట్ ప్రీమియర్ చేసిన ఆహా ఈ మధ్య మళ్లీ తమిళ మలయాళ డబ్బింగ్ కంటెంట్ మీద గట్టి దృష్టి పెడుతోంది. అందులో భాగంగానే రెండేళ్ల క్రితం కోలీవుడ్ లో వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సూపర్ డీలక్స్ ని ఈ వారంలోనే అందించబోతున్నారు.

ఇందులో విజయ్ సేతుపతి హిజ్రాగా నటించడంతో పాటు సమంత డిఫరెంట్ క్యారెక్టర్ చేయడంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తాజాగా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నాగ చైతన్య లవ్ స్టోరి, నాగ శౌర్య లక్ష్య హక్కులను కూడా ఆహా సొంతం చేసుకోవడం ఇప్పుడు ఓటిటి వర్గాల్లో సంచలనంగా మారింది. రీజనల్ కంటెంట్ విషయంలో ప్రైమ్ లాంటి వాటికి గట్టి పోటీ ఇవ్వలేకపోతున్న హాట్ స్టార్ లాంటి వాటితో పోలిస్తే ఆహా దూకుడు మీద ఉందనే చెప్పాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓటిటి పాజిబిలిటీ గురించి గతంలో బన్నీ వాస్ చెప్పాడు కానీ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి

ఇతర యాప్స్ తో పోలిస్తే చాలా తక్కువ ధరకే చందాను అందిస్తున్న ఆహా ఇదే స్పీడ్ ని మైంటైన్ చేస్తే మాత్రం తక్కువ టైంలోనే ఇంకా వేగంగా విస్తరించే అవకాశం. ఇప్పటికే చెన్నైలో ఆఫీస్ మొదలుపెట్టి తమిళ వెర్షన్ ని కూడా లాంచ్ చేయబోతున్నట్టు న్యూస్ ఉంది. సౌత్ మొత్తం ఏ భాషకు ఆ బాషా విడివిడిగా కంటెంట్ ఇచ్చే ప్లానింగ్ లో ఉంది ఆహా. దీని కోసం కోట్ల పెట్టుబడిని సైతం సిద్ధం చేసినట్టుగా సమాచారం. థియేటర్ల భవిష్యత్తు గురించి ఇంకా నీలి నీడలు కొనసాగుతున్న తరుణంలో ఓటిటి సంస్థలు ఎవరి ప్రణాళికలు వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు . డామినేట్ చేయడానికి ఇంత కన్నా మంచి అవకాశం దొరకదు మరి

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet