టాప్ గేర్ రిపోర్ట్

హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తున్న ఆది సాయికుమార్ 2022 సంవత్సరాన్ని అతిథిదేవోభవతో మొదలుపెట్టి ఏడాది ముగింపుని టాప్ గేర్ తో క్లోజ్ చేస్తున్నాడు. ఇవాళ చెప్పుకోదగ్గ రిలీజులు ఉన్నప్పటికీ అంతో ఇంతో గుర్తింపు ఉన్న మొహం తనదే కావడంతో ఓ మోస్తరు డీసెంట్ ఓపెనింగ్స్ తో టాప్ గేర్ స్టార్ట్ అయ్యింది. నిజానికి ఆది మార్కెట్ ఎప్పుడో డౌన్ అయ్యింది. కేవలం డబ్బింగ్, శాటిలైట్, ఓటిటి హక్కులతో వర్కౌట్ అవుతున్న కారణంగా నిర్మాతలు ముందుకు వస్తూనే ఉన్నారు. వాటిలో భాగంగా వచ్చిందే టాప్ గేర్. కెవి శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో శశికాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

క్యాబ్ నడుపుకునే అర్జున్(ఆది సాయికుమార్)కు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అధ్య(రియా సుమన్)అంటే ప్రాణం. గర్భం దాల్చిన తనను కంటికి రెప్పలా చూసుకుంటూ జీవితంలో గొప్ప స్థాయికి చేరాలని కష్టపడుతూ ఉంటాడు. మాదకద్రవ్యాలతో వ్యాపారం చేసే ఓ గ్యాంగ్ అర్జున్ తో రైడ్ మాట్లాడుకోవడంతో అసలు ప్రమాదం మొదలవుతుంది. కోట్ల విలువైన సరుకు కోసం ఈ దందాకు నాయకుడైన సిద్దార్థ్(మైమ్ గోపి) అర్జున్ వెంటపడతాడు. అది కనక దొరక్కపోతే ఆద్యను చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో రాత్రి పూట భయంకరమైన పద్మవ్యూహంలో చిక్కుకున్న అర్జున్ ఆ డ్రగ్స్ ఎక్కడున్నాయో చిక్కువిప్పుకుంటూ పోతాడు. ఆ తర్వాత జరిగేదే అసలు స్టోరీ

తీసుకున్న పాయింట్ మరీ కొత్తది కాకపోయినా శశికాంత్ దాన్ని స్క్రీన్ ప్లే సహకారంతో ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశాడు. ఎక్కువ సాగదీయకుండా హీరో హీరోయిన్ ట్రాక్ కోసం టైం వేస్ట్ చేయకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోయి తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ రెండో సగంలో అదే టెంపోని కొనసాగించకపోవడంతో గ్రాఫ్ కొంత డౌన్ అయ్యింది. కొంత భాగం ఛేజింగులతోనే సాగిపోవడం ల్యాగ్ కు కారణమయ్యింది. ఆది సాయికుమార్ ఈ ఏడాది వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇదే బెటర్ అనిపిస్తుంది కానీ టైటిల్ కు తగ్గట్టు మొదటి నుంచి చివరి దాక టాప్ గేర్ లో వెళ్ళలేదు కానీ ఈ జానర్ ని ఇష్టపడే వాళ్లకు డీసెంట్ వాచే

Show comments