iDreamPost
android-app
ios-app

పెళ్లి చేసుకోక పోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన సదా!

పెళ్లి చేసుకోక పోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన సదా!

సదా.. ఈ పేరు తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ ఎందరో యువకులు గుండెలు ముక్కలయ్యేలా వెండితెరపై చాలా అరుదుగా కనిపిస్తుంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ‘జయం’ సినిమాతో  తెలుగు తెరకు సదా పరిచయమైంది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ జీరో సైజ్ సుందరి. తొలి సినిమాలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా, మన పక్కింటి యువతిగా కనిపించి.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సినిమా విజయం ఇచ్చిన కిక్కుతో.. ఆ తరువాత  తెలుగులో వరుస సినిమాల ఆఫర్లు వచ్చాయి.

తెలుగులో దొంగ దొంగది, నాగ, అపరిచితుడు, ఔనన్నా కాదన్న వంటి సినిమాలో నటించి అలరించింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ పరిశ్రమలో కూడా అనేక సినిమాలో నటిచింది. చాలా కాలంపాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆ తరువాత వెండి తెరకు దూరమైంది. చాలా రోజుల తరువాత ఒకటీ అరా సినిమాల్లో కనిపించినా.. పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవలే పలు టీవీ షోల్లో జడ్జీగా వ్యవహరిస్తో తెగ సందడి చేస్తుంది. మరోసారి హీరోయిన్ గా సత్తా చాటాలని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.

మరోవైపు ఈ అమ్మడు సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది.  తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ భామకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా మంది సదా పెళ్లి విషయంపై అనేక రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సదా పెళ్లి చేసుకోలేదు. నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా కూడా సదా పెళ్లి చేసుకోలేదు. ఏమైనా లవ్ ఫెయిల్యూర్ జరిగి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతన్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలిపింది ఈ అమ్మడు.

తాను పెళ్లి చేసుకోలేదు కాబట్టే  ఎంతో సంతోషంగా ఉన్నాని, కావాల్సినంత ఫ్రీడమ్ ఉందని సదా తెలిపింది. అలానే తనకు జంతువుల అంటే చాలా ఇష్టమని తెలిపింది.  జంతువులను ప్రేమించడం చాలా ఇష్టమని ఈ అమ్మడు తెలిపింది. ఒక వేళ పెళ్లి చేసుకుంటే ఇవన్నీ దొరకవు.. మనల్ని అర్ధం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపొవచ్చుని తెలిపింది. అంతేకాక ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు కదా.. అలాంటప్పుడు పెళ్లి చేసుకోక పోవడమే ఉత్తమం కదా అంటూ ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. మరి.. తన పెళ్లిపై సదా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet