iDreamPost
android-app
ios-app

నా భర్త నా వీడియోలను రూ. 50 లక్షలకు అమ్మాడు: రాఖీ సావంత్‌

  • Published Aug 24, 2023 | 8:22 AM Updated Updated Aug 24, 2023 | 8:22 AM
  • Published Aug 24, 2023 | 8:22 AMUpdated Aug 24, 2023 | 8:22 AM
నా భర్త నా వీడియోలను రూ.  50 లక్షలకు అమ్మాడు: రాఖీ సావంత్‌

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ రాఖీ సావంత్‌ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వ్యక్తిగత జీవితం, ఇతర నటులపై దారుణమైన కామెంట్లు ఇలా ఏదో ఒక విషయంతో మీడియాకు పని చెబుతూ ఉంటుంది. తాజాగా, ఆమె తన భర్త ఆదిల్‌ ఖాన్‌పై చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆదిల్‌ తన ప్రైవేట్‌ వీడియోలను డబ్బులకు అమ్మాడని ఆమె ఆరోపిస్తోంది. కొన్ని నెలల క్రితం ఆదిల్‌, రాఖీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అత్యంత రహస్యంగా వీరి పెళ్లి జరిగింది. అయితే, పెళ్లయిన ఎక్కువ కాలం వీరిద్దరూ ఒకటిగా ఉండలేదు. తర్వాత గొడవల కారణంగా విడిపోయారు. ఈ నేపథ్యంలోనే రాఖీ.. ఆదిల్‌పై కేసు పెట్టింది.

ఆ కేసు కారణంగా అతడు జైలుకు వెళ్లి వచ్చాడు. బయటికి వచ్చిన వెంటనే రాఖీపై సంచలన కామెంట్లు చేశాడు. ఇది రోజులు గడుస్తోంది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో రాఖీ సావంత్‌ మరో సంచలనానికి తెరతీసింది. తన భర్త ఆదిల్‌పై దారుణమైన ఆరోపణలు చేస్తోంది. ఆదిల్‌ తన ప్రైవేట్‌ వీడియోలను అమ్మాడని అంటోంది. అతడు దాదాపు 50 లక్షల రూపాయలకు ఆ వీడియోలను అమ్మాడని అంటోంది. బాత్‌రూములో స్నానం చేస్తుండగా తీసిన వీడియోలతో పాటు, ఇతర వీడియోలను కూడా అతడు అమ్మాడంటోంది. తరచుగా అతడు తనను రేప్‌ చేసేవాడని వెల్లడించింది.

వీడియోలు వైరల్‌గా మారితే.. విషం తాగి చావాలా? ఆత్మహత్య చేసుకోవాలా? అని ప్రశ్నిస్తోంది. ప్రపంచం మొత్తం తన న్యూడ్‌ వీడియోలు చూసిన తర్వాత తాను ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ‘ నా ముఖాన్ని ప్రపంచానికి ఎలా చూపించను. నేను సాధారణ స్త్రీని కాదు. ఇండియాకు సంబంధించిన సెలెబ్రిటీని’ అంటూ కన్నీటి పర్యంత అయింది. మరి, భర్త ఆదిల్‌ తన న్యూడ్‌ వీడియోలు అమ్మాడంటున్న నటి రాఖీ సావంత్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom