iDreamPost
android-app
ios-app

మరో స్టార్ నటి విడాకులు.. భర్త ఇంటి పేరు తొలగించి..

  • Published Jun 01, 2024 | 5:47 PM Updated Updated Jun 01, 2024 | 5:47 PM

సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల న్యూస్ ఎంత హల్ చల్ చేస్తున్నాయో.. డివోర్స్ వార్తలు అంత హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, సైంధవి విడాకులు తీసుకున్న సంగతి విదితమే. ఇప్పుడు మరో స్టార్ నటి కూడా అదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది.

సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల న్యూస్ ఎంత హల్ చల్ చేస్తున్నాయో.. డివోర్స్ వార్తలు అంత హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, సైంధవి విడాకులు తీసుకున్న సంగతి విదితమే. ఇప్పుడు మరో స్టార్ నటి కూడా అదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది.

  • Published Jun 01, 2024 | 5:47 PMUpdated Jun 01, 2024 | 5:47 PM
మరో స్టార్ నటి విడాకులు.. భర్త ఇంటి పేరు తొలగించి..

ఇండస్ట్రీలో మొన్నటి వరకు పెళ్లి వార్తలు వినిపించగా.. ఇప్పడు విడాకుల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, సింగర్ సైంధవి విడిపోతున్నామంటూ ఎనౌన్స్ చేశారు. అలాగే బాలీవుడ్ లవ్ కపుల్స్ రణవీర్ సింగ్, దీపికా పడుకునే డివైడ్ అవుతున్నారంటూ రూమర్స్ వచ్చాయి. ఇద్దరు కలిసి దర్శనమివ్వడంతో అదంతా తూచ్ అనుకున్నారు. అలాగే టాలీవుడ్, కోలీవుడ్ యాక్ట్రెస్ నమిత సైతం భర్త నుండి వేరు పడుతున్నట్లు న్యూస్ రాగా, వెంటనే ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలాగే మరో బాలీవుడ్ బ్యూటీ పుల్ ప్రేమ జంట.. మలైకా అరోరా, అర్జున్ కపూర్ విడిపోతున్నారంటూ మరో వార్త హల్ చల్ చేసింది. దీంతో మలైకా టీం.. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది.

కాగా,ఇప్పుడు మరో టాలీవుడ్, బాలీవుడ్ చిన్నది కూడా భర్తకు విడాకులు ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని కారణం తన సోషల్ మీడియా ఖాతా నుండి భర్తతో దిగిన ఫోటోలను తీయడంతో పాటు.. భర్త ఇంటి పేరుని తొలగించింది నటి. దీంతో నాలుగేళ్ల కాపురానికి ఎండ్ కార్డు పడనున్నట్లు తెలుస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. తనీష్ హీరోగా వచ్చిన మేం వయస్సుకు వచ్చాం హీరోయిన్ నీతి టేలర్. 2012లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి విదితమే. రాహుల్ రవీంద్రన్ సరసన పెళ్లి పుస్తకం అనే మూవీ కూడా చేసింది. లవ్ డాట్ కామ్ అనే చిత్రంలో నటించింది. వెండితెర మీద కన్నా బుల్లితెరపైనే అలరించింది ఈ బూరె బుగ్గల బ్యూటీ.

2009లో వచ్చిన ప్యార్ కా బంధన్ అనే ధారావాహికతో నటనలోకి అడుగుపెట్టిన అమ్మడు. వరుసగా హిందీ సీరియల్స్ చేసింది. ఆ సమయంలోనే తెలుగు దర్శకుల కళ్లల్లో పడి ఇక్కడ ఆఫర్లు అందుకుంది. ముచ్చటగా తెలుగులో మూడు సినిమాలు చేసి వెండితెర తనకు అచ్చిరాలేదని భావించిన ఈ భామ.. బుల్లితెరకు పరిమితమైంది. 2019లో తన బాయ్ ఫ్రెండ్ పరీక్షిత్ బావాతో ఎంగేజ్ మెంట్ చేసుకోగా.. 2020లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత వీరి బంధం తెగిపోనుందని తెలుస్తోంది. భర్త ఇంటి పేరు తొలగించడం.. అతడ్ని అన్ ఫాలో చేయడం, అలాగే కొన్ని ఫోటోలు కనిపించకపోవడంతో ఈ విడాకుల న్యూస్ ఒక్కసారిగా వైరల్ అవుతుంది. మరీ దీనిపై నీతి టైలర్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabet