iDreamPost
android-app
ios-app

క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది.. గుర్తు పట్టారా?

క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది.. గుర్తు పట్టారా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో యుగం నడుస్తుంది. ప్రపంచంలో ఏమూలన ఏమి జరిగిన క్షణాల్లో తెలిసిపోతున్నాయి. అలానే ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకుని సినీ,రాజకీయ ప్రముఖలు తమ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన పాత ఫోటోలు, చిన్ననాటి ఫోటోలు, ఇతర ప్రత్యేకమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ భామల చిన్ననాటి ఫోటోలు వైరల్ కాగా తాజాగా మరో అమ్మడి చిన్ననాటి క్యూట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పై ఫోటో ఎంతో క్యూట్ గా కనిపిస్తోన్న ఈ అమ్మడు  తెలుగులో ఒకప్పుడు ఓ ఊపు ఊపేసింది. తనదైన నటనతో, అందంతో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకుంది. ఇటీవలే బాలయ్య సినిమాలో సింహవంటి చిన్నోడే అంటూ చిందులేసింది. ఆ బ్యూటీ ఎవరో గుర్తుకు వచ్చే ఉంటుంది. ఆమె  ఎవరో కాదండి.. హీరోయిన్ నమిత. ‘సొంతం’ సినిమాతో  టాలీవుడ్ లోకి హీ రోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నమిత గురించి అందరికి తెలిసిందే. ఈ అమ్మడు మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి 17 ఏళ్లకే మిస్ సూరత్ గా కిరీటం గెలిచింది. తొలి సినిమాలో ఎంతో సంప్రదాయంగా ముద్దుగా ఉన్న ఈమె రాను రాను గ్లామర్ డోస్ పెంచింది.

పదేళ్ల పాటు సినిమాలలో ఫుల్ ఫామ్ లో కొనసాగింది. ఆ తరువాత అవకాశాలు తగ్గిపోతు వచ్చాయి. సింహ సినిమాలో బాలయ్యతో చిందులేసింది. కొన్నేళ్ల క్రితం తనకంటే చిన్న వయస్సున వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ అమ్మడికి కవల పిల్లలు కూడా పుట్టారు. 2001 లో మిస్ ఇండియా పోటీలలో నమిత మూడో స్థానం లో నిలిచింది. ఆ తర్వాత ఆమె పలు యాడ్స్ లో నటించించే అవకాశం వచ్చింది. ఆ తరువాత పలు రియాలిటీ షో లలో కూడా పాల్గొంది. ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో హీరోయిన్ నమితకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికి ఈ సినిమాను చూస్తే ఆమె ఒంపుసొంపులే అందరికి గుర్తొస్తాయి. నమిత పుట్టిన రోజు సందర్భం ఆమెకు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి.. ఈ బ్యూటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbenjaminsbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş