sai
sai
Actress Laya Shares Her Children Rakha Bandhan Moments – Sakshi
తెలుగు ఇండస్ట్రీలో పదేళ్లపాటు హీరోయిన్ చాలా సినిమాలు చేసిన లయ అమెరికాలో సెటిలయ్యింది. స్వయంవరం ఆమె మొదటి సినిమా. త్రివిక్రమ్ కథ, మాటలు రాసిన ఈ సినిమా హిట్. ఆ తర్వాతప్రేమించు, మిస్సమ్మ, హనుమాన్ జంక్షన్, స్వరాభిషేకం వంటి సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. చివరగా అమర్ అక్బర్ ఆంటోనీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది.
సినిమాలను వదిలిపెట్టిన లయ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. రిల్స్ చేస్తోంది. ట్రెండింగ్ సాంగ్స్ కు డాన్స్ లేస్తోంది. అభిమానులతో టచ్‌లో ఉంటోంది.

రాఖీ పౌర్ణమి వీడియోను లయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇందులో లయ కూతురు తన తమ్ముడికి రాఖీ కడుతుంది. కూతురు శ్లోకా అచ్చుగుద్దినట్లు లయలానే ఉంది. కాదు అంతకన్నా క్యూట్ గా ఉందని అంటున్నారు నెట్ జెన్స్. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్.