iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..ప్రముఖ నటి మృతి!

  • Published May 07, 2024 | 1:34 PM Updated Updated May 07, 2024 | 1:34 PM

Kanakalatha passes away: ఇటీవల చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు వెంటటాడుతున్నాయి. పలువురు నటీనటులు ఇతర రంగాలకు చెందిన వారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు.

Kanakalatha passes away: ఇటీవల చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు వెంటటాడుతున్నాయి. పలువురు నటీనటులు ఇతర రంగాలకు చెందిన వారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు.

  • Published May 07, 2024 | 1:34 PMUpdated May 07, 2024 | 1:34 PM
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..ప్రముఖ నటి మృతి!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సినీ నటులు, ప్రముఖ దర్శక, నిర్మాతలు, సింగర్స్, రైటర్స్ ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్లుగా పేరు తెచ్చుకున్న లొల్లు సభ శేషు, గరిమెళ్ల విశ్వేశ్వరరావు, ప్రముఖ సినీ రచయిత శ్రీ రామకృష్ణ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీర భద్రరావు, విలన్ డేనియల్ బాలాజీ ఇలా వరుసగా కన్నుమూశారు.ఈ మధ్యనే ప్రముఖ హీరోయిన్ అమృత పాండే, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, సింగర్ సింగ్ ఉమా రామనన్ కన్నుమూశారు. ఈ విషాదాలు మర్చిపోక ముందే ప్రముఖ నటి ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. వివరాల్లోకి వెళితే..

మాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. 350 కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ సినీ, సీరియల్ నటి కనకలత (63) సోమవారం తన నివాసంలో కన్నుమూశారు. సపోర్టింగ్ రోల్స్ లో నటించిన కనకలత మాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇటీవల ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. సినీమాల్లో బిజీగా ఉన్న కనకలత తర్వాత బుల్లితెరపై అడుగు పెట్టింది. పలు సీరియల్స్ లో కీలక పాత్రలు పోషించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తుంది కనకలత. ఆమెకు సీరియల్స్, సినిమాల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ వాటన్నింటికి తిరస్కరించింది.

లాక్ డౌన్ సమయంలో కనకలత సినిమాలకు దూరంగా ఉంటూ.. మలయింకీజులో తన సోదరి విజయమ్మ ఇంట్లో ఉంటూ వస్తుంది. 2021 లొ ఆమె ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడింది. ఇండస్ట్రీకి దూరమైనప్పటి నుంచి ఆమె మానసికంగా కృంగిపోతూ ఉండేదని తెలిపింది. మోహన్‌లాల్ నటించిన ‘తన్మాత్ర’ చిత్రంలో నటించింది. చిల్ల్, కరియిలక్కట్టుపోలే, రాజు కొడుకు, జాగ్రత్త, కిరీటం, నా సూర్యపుత్రిక, కౌరవర్, అమ్మాయనే సత్యం, మొదటి భర్తమణి, తచ్చోళి వర్గీస్ చేకవర్, స్ఫటికం, అనియత్తిప్రావ్, హరికృష్ణన్స్, మట్టుపెట్టి మచ్చన్, ప్రియం, పంచవర్ణత, ఆకాశగంగ 2 నటించింది. అలాగే తమిళ, తెలుగు భాషల్లో కూడా ఆమె నటించింది. ఆమె చివరి సినిమా పూక్కలం.  ఆమె మృతి పై పలువురు సినీ నటులు నివాళులర్పించారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio