iDreamPost
android-app
ios-app

అలాంటి వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు: హరితేజ

అలాంటి వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు: హరితేజ

తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హరితేజ. సీరియళ్లతో.. బుల్లి తెరపై స్టార్‌ అయిన తర్వాత సినిమాల్లోకి వచ్చారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి మంచి పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. కేవలం నటిగానే కాదు.. యాంకర్‌గా కూడా తన సత్తా చాటారు. బిగ్‌బాస్‌ ద్వారా ఆమె క్రేజ్‌ మరింత పెరిగింది. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు, సీరియళ్లతో హరితేజ బిజీబిజీగా గడుపుతూ ఉన్నారు. అయినప్పటికి ఆమె సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు.

తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో.. ‘‘ నువ్వు ఎక్కడున్నావ్‌.. ఎలా ఉన్నావ్‌.. ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లావా? అని అడిగే గొంతును ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకు. (ముఖ్యంగా తల్లిదండ్రుల్ని).. ఎందుకో చెప్పాలని అనిపించింది’’ అని రాసుకొచ్చారు. అయితే, ఆమె ఎందుకు ఈ పోస్టు పెట్టారో తెలియక నెటిజన్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.

కాగా, హరితేజకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడు లక్షలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆమె ఎప్పటికప్పుడు కొత్త కొత్త లుక్కుల్లో దిగిన ఫొటోలను అందులో పోస్టు చేస్తూ ఉంటారు. అవి కాస్తా వైరల్‌గా మారుతూ ఉంటాయి. కొన్నిటిపై నెటిజన్లు నెగిటివ్‌గా స్పందిస్తూ ఉంటారు. అయినా ఆమె నెగిటివ్‌ కామెంట్లను పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూ ఉంటారు. మరి, హరితేజ పెట్టిన పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobetgrandpashabet girişgrandpashabet resmi giriş