iDreamPost
android-app
ios-app

Prabhas: ప్రభాస్‌ మంచి మనసు.. టికెట్‌ బుక్‌ చేసి మరీ నన్ను సినిమాకు పంపించాడు: హంసా నందిని

  • Published Jul 02, 2024 | 3:55 PM Updated Updated Jul 02, 2024 | 3:55 PM

డార్లింగ్‌ ప్రభాస్‌ గురించి అభిమానులే కాదు.. హీరోహీరోయిన్లు కూడా చాలా గొప్పగానే చెబుతారు. ఇక తాజాగా నటి హంసా నందిని ప్రభాస్‌ మంచి మనసు గురించి చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

డార్లింగ్‌ ప్రభాస్‌ గురించి అభిమానులే కాదు.. హీరోహీరోయిన్లు కూడా చాలా గొప్పగానే చెబుతారు. ఇక తాజాగా నటి హంసా నందిని ప్రభాస్‌ మంచి మనసు గురించి చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

  • Published Jul 02, 2024 | 3:55 PMUpdated Jul 02, 2024 | 3:55 PM
Prabhas: ప్రభాస్‌ మంచి మనసు.. టికెట్‌ బుక్‌ చేసి మరీ నన్ను సినిమాకు పంపించాడు: హంసా నందిని

డార్లింగ్‌ ప్రభాస్‌కు టాలీవుడ్‌లోనే కాక.. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉంది. బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌.. ఆ తర్వాత వరుసపెట్టి అన్ని అవే సినిమాల్లో యాక్ట్‌ చేశాడు. దాంతో పాన్‌ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ఏ ఇండస్ట్రీలో అయినా హీరోలకు అభిమానులుంటే.. ప్రభాస్‌కు మాత్రం.. అందరి హీరోల అభిమానులు ఫ్యాన్సే. అంతలా డార్లింగ్‌ అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇక తాజాగా కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు ప్రభాస్‌. ఈ సినిమా మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఐదు వందల కోట్ల క్లబ్‌లో చేరిన కల్కి చిత్రం.. 1000 కోట్ల రూపాయల రికార్డ్‌ దిశగా పరుగులు తీస్తుంది. ఇక ప్రభాస్‌ గురించి ఏ ఇండస్ట్రీ నటీనటులను అడిగినా.. డార్లింగ్‌, మనసున్న మారాజు అని చెబుతారు. తాజాగా నటి హంసా నందిని కూడా ప్రభాస్‌పై అలానే ప్రశంసలు కురిపించారు. ఆ వివరాలు..

తాజాగా హీరోయిన్‌ హంసా నందిని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డార్లింగ్‌ ప్రభాస్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ మిర్చి సినిమాలో యాక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హంసా నందిని మిర్చి మిర్చి అంటూ సాగే స్పెషల్ సాంగ్‌లో కనిపించారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు, తనకు మధ్య చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సంఘటన గురించి వెల్లడించారు హంసా నందిని. ‘‘ప్రభాస్‌కి సిగ్గెక్కువ. మిర్చి సినిమా రిలీజ్‌ అయిన తర్వాత మేము ఒక పార్టీలో కలిశాం. అయితే ఆ సినిమా షూటింగ్‌ అయ్యాక నేను మిర్చికి సంబంధించి ఏ కార్యక్రమానికి హాజరు కాలేదు. సినిమా విడుదల వేళ కూడా ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాను’’ అని గుర్తు చేసుకున్నారు.

‘‘ఇక మిర్చి సినిమా విడుదలై.. సూపర్‌ డూపర్‌ హిట్టైన తర్వాత.. ఒక సారి నేను నా నెక్ట్స్‌ సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చాను. అప్పుడే ఓ పార్టీలో ప్రభాస్‌ను కలిశాను. అప్పుడు మాటల సదర్భంలో.. ప్రభాస్‌ మిర్చి సినిమాలో నీ సాంగ్ పెద్ద హిట్టు. ఈ విషయం నీకు తెలుసా అని అడిగాడు. అందుకు నేను లేదు.. ఇంకా సినిమా కూడా చూడలేదు అని చెప్పాను. అప్పుడు ప్రభాస్‌ వెంటనే నా కోసం దగ్గరలోని థియేటర్లో మిర్చి సినిమా టికెట్ బుక్ చేశాడు. అంతేకాక సినిమాలో నా సాంగ్ ఎప్పుడొస్తుందో ఆ టైమ్ కూడా చెప్పాడు. దాంతో నేను నా సాంగ్‌ వచ్చే సమయానికి ఆ థియేటర్‌ దగ్గరికి వెళ్లి చూశాను. నిజంగానే ప్రభాస్‌ చాలా మంచి వ్యక్తి’’ అంటూ హంసా నందిని డార్లింగ్‌ మీద ప్రశంసలు కురిపించింది.

ఇక ఇదే ఇంటర్వ్యూలో క్యాన్సర్‌పై తాను ఎలా పోరాడి.. విజయం సాధించిందో వివరంగా చెప్పుకొచ్చింది హంసా నందిని. ‘‘క్యాన్సర్‌ బారిన పడ్డాను అని తెలియగానే ముందుగా చాలా భయపడ్డాను. కానీ నెమ్మదిగా నాకు నేనే ధైర్యం చెప్పుకుని.. చికిత్స చేయించుకున్నాను. చివరకు మహమ్మారిపై విజయం సాధించాను’’ అని చెప్పుకొచ్చారు. ఇక క్యాన్సర్‌ నుంచి కోలకున్న తర్వాత మళ్లీ వరుసగా సినిమాలు చేస్తున్నారు హంస నందిని. బాలీవుడ్‌ అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetherkülbet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio