iDreamPost
android-app
ios-app

రూ.25 లక్షల కోసం వెళ్లి.. మర్డర్‌ కేసులో ఇరుక్కున్న నటుడు!

  • Published Oct 12, 2023 | 10:06 PM Updated Updated Oct 12, 2023 | 10:06 PM
  • Published Oct 12, 2023 | 10:06 PMUpdated Oct 12, 2023 | 10:06 PM
రూ.25 లక్షల కోసం వెళ్లి.. మర్డర్‌ కేసులో ఇరుక్కున్న నటుడు!

నటుడు పింగ్‌పాంగ్‌ సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సై, ఆ నలుగురు సినిమాల్లో నటనతో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి మంచి పాత్రలు చేశారు. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం తనకు సంబంధంలేని ఓ హత్య కేసులో పేరు నాని సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు. తాజాగా, సూర్య హత్య కేసు గురించి మాట్లాడుతూ.. ‘‘ తాను ‘కలియుగ’అనే సినిమా తీశానని, ఆ సినిమా నిర్మాణం కోసం తన దగ్గరున్న డబ్బులు మొత్తం ఖర్చు చేశానని చెప్పాడు.

అయినప్పటికీ సినిమాను రిలీజ్‌ చేయటానికి ఇంకా 25 లక్షల రూపాయలు అవసరం అయ్యాయని తెలిపాడు. ఓ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ద్వారా రాకేశ్‌ రెడ్డితో పరిచయం ఏర్పడిందని అన్నారు. సినిమాలకు డబ్బులు అప్పుగా ఇచ్చే రాకేశ్‌కు తన సినిమా చూపించి డబ్బులు అడిగానని వెల్లడించాడు. అదే సమయంలో డబ్బు కోసం మరో వ్యక్తి చిగురుపాటి జయరాంను కూడా తాను కలిశానని తెలిపాడు. డబ్బులు ఇస్తానన్న పదిరోజుల్లో ఇస్తానని ఆయన చెప్పాడన్నారు.

అక్కడినుంచి వచ్చిన మరుసటి రోజే ఆయన హత్య జరిగిందని వెల్లడించారు. ఆయనను కలిసిన తనను కూడా పోలీసులు విచారించారని తెలిపారు. తర్వాత తనకు ఆ కేసుతో సంబంధం లేదని తేల్చినట్లు పేర్కొన్నారు. మీడియా రాసిన వార్తల కారణంగా చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పారు. కలియుగ సినిమా కోసం ఇళ్లు కూడా అమ్మేశానని తెలిపారు. ఆ సినిమా వచ్చే నెలలో ఓటీటీలోకి రాబోతోందని వెల్లడించాడు.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş