iDreamPost
android-app
ios-app

Actor Chandan Kumar: సెట్‌లో దురుసు ప్రవర్తన ఎఫెక్ట్.. చందన్‌పై నిషేధం

  • Published Aug 03, 2022 | 3:48 PM Updated Updated Aug 03, 2022 | 3:48 PM
Actor Chandan Kumar: సెట్‌లో దురుసు ప్రవర్తన ఎఫెక్ట్.. చందన్‌పై నిషేధం

షూటింగ్‌ సెట్‌లో బుల్లితెర హీరో చెంపదెబ్బతిన్న సంఘటన కొత్త మ‌లుపు తీసుకుంది. న‌టుడి నిషేధం వ‌రుకు వెళ్లింది. స్టార్ మా సీరియ‌ల్ సావిత్రమ్మ గారి అబ్బాయితో తెలుగులో పేరుతెచ్చుకున్న నటుడు చందన్‌ కుమార్ శ్రీమతి శ్రీనివాస్ సీరియల్లో లీడ్‌ రోల్ చేస్తున్నాడు. సోమవారం షూటింగ్‌ సెట్‌లో, అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో గొడ‌వ‌ప‌డ్డాడు. అతడి తల్లిని దూషించాడు. అంతే, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నటుడితో వాదనకు దిగాడు.

ఈ క్రమంలో చందన్ ప్ర‌వ‌ర్త‌న శృతిమించ‌డంతో అక్కడి వారంత అతడిపై సీరియస్‌ అయ్యారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌కి సారీ చెప్ప‌మ‌న‌డంతో చందన్ కుమార్ నేనేంటో చూపిస్తా అంటూ సీరియ‌స్ గానే పెద్ద డైలాగ్స్ కొట్టాడు. కోపం ప‌ట్ట‌లేక‌పోయిన‌ అసిస్టెంట్ డైరెక్టర్ చందన్ కుమార్‌ని అందరి ముందే కొట్టాడు. చుట్టూ ఉన్న‌వాళ్లు ఇద్ద‌రినీ ఆపారు. చందన్ షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు. అక్కడితో గొడవ ఆగింద‌నుకొంటే, చందన్ కన్నడ మీడియా ముందు తెలుగు బుల్లితెరని హేళ‌న చేస్తూ కామెంట్స్ చేశాడు.


ఈ వివాదం కాస్తా మ‌రింత సీరియ‌స్ అయ్యింది. తెలుగు టీవీ ప‌రిశ్ర‌మ గురించి తప్పుగా మాట్లాడినందుకు తెలుగు టీవీ ఫెడరేషన్ చందన్‌పై బ్యాన్‌ విధించింది. తెలుగు టీవీ ఫెడరేషన్ సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడాడు. షాట్ రెడీ అని నాలుగు సార్లు పిలిచా. అయినా రాకుండా నన్ను కొట్టి, బూతులు తిట్టాడు. డైరెక్టర్‌కి కంప్లైంట్ చేస్తే, బైట‌కు రా దమ్ముంటే, నేనెంటో చూపిస్తానంటూ బెదిరించాడ‌ని చెప్పాడు. చందన్‌ తీరును గ‌ర్హించిన‌ తెలుగు టీవీ ఫెడరేషన్, చందన్‌ని బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చింది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet