నటుడు విజయకాంత్ కు మూడు వేళ్లు తొలగింపు

ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ కుడికాలి వేళ్లలో మూడు వేళ్లను వైద్యులు తొలగించారు. మధుమేహం కారణంగా ఆయనకు మూడువేళ్లను తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు డీఎండీకే కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. కొంతకాలంగా ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. మధుమేహం కారణంగా కుడికాలిలో మూడు వేళ్లకు రక్త సరఫరా కాకపోవడంతో.. సోమవారం వైద్యులు వాటిని అత్యవసరంగా తొలగించారు. ప్రస్తుతం విజయకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

విజయకాంత్ ఇనిక్కుం ఇలామై అనే సినిమాతో నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. సుమారు 100కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. 20కి పైగా పోలీస్ సినిమాల్లోనే నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. కేరీర్ మొదట్లో పరాజయాలు చూసినా.. “దూరతు ఇడి ముజక్కం, సత్తం ఓరు ఇరుత్తరై” సినిమాలతో విజయాలు అందుకున్నారు. విజయకాంత్ నటించిన 100వ సినిమా కెప్టెన్ ప్రభాకర్ సూపర్ హిట్ కావడంతో.. అప్పట్నుంచీ కెప్టెన్ అని పిలుస్తారు. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ డబ్ కావడంతో తెలుగు ప్రేక్షకులకూ ఆయన సుపరిచితులే. కొన్నాళ్లకు ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇండస్ట్రీని వీడి 2005లో డీఎంకే పార్టీని స్థాపించారు.

 

Show comments