iDreamPost
android-app
ios-app

ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడుకు చుక్కెదురు

  • Published Nov 19, 2019 | 4:53 AM Updated Updated Nov 19, 2019 | 4:53 AM
ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడుకు చుక్కెదురు

ఏసీబీ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చుక్కెదురైంది. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాలని ఆరోపిస్తూ 2005లో లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. ఈ కేసు విషయంలో అప్పట్లో హైకోర్ట్ విచారణ నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. ఈ కేసు స్టే పై ఎటువంటి పోడిగింపూ లేకపోవడంతో విచారణ ప్రారంభించాలని ఏసీబీ కోర్టు జడ్జి సోమవారం ఉత్త్తర్వులు జారీ చేస్తూ ఈ నెల 25 వ తేదీకి వాయిదా వేశారు.

కేసు పూర్వాపరాలు

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అక్రమాస్తులు కూడబెట్టారని, వాటిపై విచారణ జరిపించాలనీ లక్ష్మీపార్వతి ఆరోపిస్తూ.. ఈ విషయంలో ఏసీబీ విచారణ జరిపించాలని కోరుతూ ఏసీబీ స్పెషల్ కోర్టులో లక్షపార్వత ఫిర్యాదు చేశారు. అయితే, చంద్రబాబు దీనిపై ఇంప్లీడ్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దాంతో హైకోర్టు కు వెళ్లిన చంద్రబాబు నాయుడుకు అక్కడ ఊరట లభించింది. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపి ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే విధించారు.

Also Read: వివాహం,అధికారం,మీడియా…లక్ష్మి పార్వతి

ఈ స్టే ఎత్తివేయాలని లక్ష్మీపార్వతి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అప్పటి నుంచీ ఈ కేసులో స్టే కొనసాగుతోంది. కాగా, గత సంవత్సరం సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుతో ఈ కేసు ఏసీబీ కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే కొనసాగుతుందని వాదించారు. కానీ లక్ష్మీపార్వతి తరపు లాయర్ సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఊతంకిస్తూ వాదించారు. అదీ కాకుండా ఆ స్టే పొడిగింపు ఉత్తర్వులు కూడా లేవని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో, 2005లో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించిన న్యాయమూర్తి, 2005లో హైకోర్టు ఇచ్చిన స్టేను పొడిగించని విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, సుప్రీంకోర్టు తీర్పుతో 2005లో విధించిన స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని చెబుతూ విచారణకు ఆదేశాలు జారీచేశారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alBetraBetramadridbetkatlaMarsbahis GirişCasibom GirişMarsbahis GirişCasibom Giriş