iDreamPost
android-app
ios-app

విడిపోవడం నో చెప్పడమూ సంచలనమే

  • Published Jul 04, 2021 | 4:37 AM Updated Updated Jul 04, 2021 | 4:37 AM
  • Published Jul 04, 2021 | 4:37 AMUpdated Jul 04, 2021 | 4:37 AM
విడిపోవడం నో చెప్పడమూ సంచలనమే

నిన్న సినిమా రంగానికి సంబంధించి రెండు బ్రేకప్ లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావుతో 15 ఏళ్ళ బంధానికి గుడ్ బై చెప్పడం మీడియా వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఇది తనకు మొదటి వివాహ బంధం కాకపోయినా లేట్ ఏజ్ లో ఇలా విడాకులకు వెళ్లడమే అసలు ట్విస్ట్. అచ్చం కమల్ హాసన్ తరహాలోనే అమీర్ ఖాన్ సైతం లాంగ్ రిలేషన్లకు గుడ్ బై చెప్పడం గమనార్హం. కారణాలు బయటికి చెప్పలేదు కానీ ఇంత సుదీర్ఘమైన బంధాలను తెంచుకోవడం సెన్సేషనే. ఇలాంటివి పరిశ్రమలో కొత్త కాకపోయినా సరే అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తాయి.

ఇక మూడు నెలల క్రితమే ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న మెహ్రీన్ కూడా పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పడం మరో హాట్ టాపిక్. రాజకీయ నేపధ్యం కలిగిన భవ్య బిష్ణోయ్ తో ఇకపై కొనసాగలేనని తన మనసు చెప్పిన మాట వినబోతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో మెహ్రీన్ పేర్కొనడం గమనార్హం. ఒకరకంగా ఇదీ మంచిదే. మూడు ముళ్ళు పడ్డాక సెలవు తీసుకోవడం కంటే ఇలా అండర్ స్టాండింగ్ కుదరనప్పుడు డీసెంట్ గా నో చెప్పుకోవడం హర్షణీయం. గతంలో అఖిల్ సైతం ఎంగేజ్ మెంట్ అయ్యాక ఏవో కారణాల వల్ల దాన్ని రద్దు చేసుకున్న సంగతి గుర్తే. మళ్ళీ ఆ ప్రస్తావన కూడా ఎక్కడా రాలేదు

సెలబ్రిటీలు కాబట్టి విడిపోయినా కూడా అదో పెద్ద న్యూస్ అవుతోంది. అమీర్ ఖాన్, మెహ్రీన్ ఇద్దరి విషయంలోనూ సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. భవ్య మద్దతుదారులు మెహ్రీన్ ని టార్గెట్ చేసి కొంత ట్రోలింగ్ కూడా చేశారు. ఇక లాల్ సింగ్ చద్దాగా త్వరలో తెరపై కనిపించబోతున్న అమీర్ ఖాన్ కు ఈ వయసులో ఇలా విడిపోవాలని ఎందుకు అనిపించిందోనని కామెంట్స్ పెడుతున్నారు. అయినా ఈ పెళ్లిళ్లు, విడిపోవడాలు సావిత్రి, ఎన్టీఆర్ లతో మొదలుపెడితే ఇప్పటి తరం దాకా లెక్కలేనన్ని ఉదాహరణలు కనిపిస్తాయి. సినిమా తారలు కాబట్టి జనాల ఆసక్తికి తగ్గట్టు మీడియా ఫోకస్ వీటి మీద ఉంటుంది

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetador girişgrandpashabet