iDreamPost
android-app
ios-app

కలలో ప్రేయసితో పెళ్లి.. నిజం చేసేందుకు ప్రయత్నించి..

  • Published Oct 11, 2023 | 4:55 PM Updated Updated Oct 11, 2023 | 4:55 PM
  • Published Oct 11, 2023 | 4:55 PMUpdated Oct 11, 2023 | 4:55 PM
కలలో ప్రేయసితో పెళ్లి.. నిజం చేసేందుకు ప్రయత్నించి..

ప్రేమించాలని వెంట పడటం, పెళ్లి చేసుకోవాలని హింసించడం చూశాం కానీ.. ప్రేయసిని దక్కించుకోవడం కోసం ఇలా కూడా చేస్తారా అనిపించకమానదు ఇతడి విషయంలో. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని మాజీ రాష్ట్రపతి, దివంగత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం అన్నారని, అమ్మాయి విషయంలో మనోడు స్ఫూర్తి పొందినట్లు కాబోలు. తన కలను నిజం చేసేందుకు ప్రయత్నించి ఊసలు లెక్కపెట్టేందుకు సిద్ధమౌతున్నాడు. ఇంతకు ఏం జరిగిందనేగా.. పీకల్లోతు ప్రేమలో ఉన్న యువకుడు..తన ప్రేయసితో పెళ్లైనట్లు కలగన్నాడట. ఆ కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నించాడు. ఇంకేముందీ ఊరంతా ఉతకబాది పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు  ఊచలు లెక్కించేందుకు సిద్దమయ్యాడు. బహుశా ఇది కలలో వచ్చి ఉండదు.

ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జమయి బజార్ ప్రాంతానికి చెందిన వీరూ సింగ్.. ఓ కోచింగ్ సెంటర్‌లో యువతిని పిచ్చ పిచ్చగా ప్రేమించాడు. రోజు ఆమెను ఫాలో అయ్యేవాడు. ఆమెను ఆరాధిస్తూ వన్ సైడ్ లవ్వర్ అయ్యాడు. తన వెంటే పడుతున్న అబ్బాయిని చూసిన యువతి కూడా అతడి నుండి తప్పించుకునేందుకు నానా అవస్థలు పడేది. అయితే ఆమెకు అతడు ప్రపోజ్ చేయలేదు. కానీ ఆమె గురించి ఆలోచనలు చేస్తూ పడుకున్నాడు. కలలో కూడా ఆమె ఆలోచనలే. ప్రేయసితో పెళ్లైనట్లు కలగన్నాడు. మెళకువ రాగానే.. అది కల అని నవ్వుకుని, అది నిజం చేయాలనుకున్నాడు.

యువతి కోచింగ్ వెళుతున్న సమయంలో అడ్డు పడి.. ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. అంతేకాకుండా ఆమె నుదుటిన సింధూరం దిద్దాడు. దీంతో భయానికి లోనైన యువతి అరుస్తూ.. దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించగా.. చేయి పట్టుకుని తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో యువతి బిగ్గరగా కేకలు పెట్టడంతో.. స్థానికులు వచ్చి అతడ్ని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో తనకు కలలో వచ్చిన విషయాన్ని చెప్పగా.. వారు సైతం నవ్వుకున్నారు. ప్రేయసిని దక్కించుకోవడం కోసం అతడు ఇలా చేయడాన్ని మీరేమంటారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş