Heart Attack: షాకింగ్: గుండెపోటుకు గురైన రెండేళ్ల చిన్నారి!

షాకింగ్: గుండెపోటుకు గురైన రెండేళ్ల చిన్నారి!

ఈ మధ్యకాలంలో గుండెపోటుతో చాలా మంది చనిపోతున్నారు. ఈ మరణాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ప్రధానంగా రెండేళ్ల పిల్లల నుంచి 70 ఏళ్ల వృద్దుల వరకు అందరూ హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. డ్యాన్స్ చేస్తూ, జిమ్ చేస్తూ, నిద్రలో సైతం గుండెపోటుకు గురై మృతి చెందుతున్నారు. అయితే ఈ వరుస ఈ గుండెపోటు మరణాలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ రెండేళ్ల చిన్నారి సైతం గుండెపోటుకు గురైంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఇంతకు వైద్యులు ఆ చిన్నారిని బతికించారా?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా విస్తారా విమానం బెంగుళూరు నుంచి ఢిల్లీ బయలు దేరింది. అయితే విమానం ప్రయాణిస్తున్న క్రమంలోనే అందులో ఉన్న ఓ రెండేళ్ల చిన్నారి గుండెపోటుకు గురైంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఫీల్ అయింది. అదే విమానంలో ప్రయాణిస్తున్న కొందరు వైద్యులు వెంటనే స్పందించి ఆ చిన్నారికి సీపీఆర్ చేశారు. ఆ తర్వాత ఆ విమానాన్ని నాగాలాండ్ కు మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం ఆ చిన్నారిని అక్కడి నుంచి అంబులెన్స్ లో ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు చికిత్స చేసి గుండెపోటుకు గురైన ఆ చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఇదే విషయాన్ని తాజాగా ఢిల్లీ ఎయిమ్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ వార్త తెలుసుకుని అందరూ ఉలిక్కిపడుతున్నారు. గుండెపోటుకు గురైన రెండున్నరేళ్ల చిన్నారి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: పోలీస్ స్టేషన్ లో నిందితుడు మృతి! అసలేం జరిగిందంటే?

Show comments