వీడియో: స్టేజ్ పై డ్యాన్స్ ఇరగదీసిన నవ వధువు

వీడియో: స్టేజ్ పై డ్యాన్స్ ఇరగదీసిన నవ వధువు

గత కొన్ని రోజుల నుంచి నవ వధువులు పెళ్లి బరాత్ లో భాగంగా డ్యాన్స్ లు చేయడం అనేది ట్రెండింగ్ గా మారింది. వీళ్లు చేసిన ఆ డ్యాన్స్ వీడియోలు సైతం క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలోకి ఎన్నో వచ్చాయి. ఇకపోతే, అచ్చం ఇలాగే మరో నవ వధువు స్టేజ్ పైనే ఓ అద్భుతమైన పంజాబీ పాటకు అదిరిపోయే స్టేప్పులు వేసి బంధువులందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక చుట్టాలంతా ఆమెను ప్రొత్సహిస్తూ చప్పట్లతో ఆమెకు ఊపును తెప్పించారు.

ఇక తగ్గేదేలేదన్నట్లుగా ఆ నవ వధువు వరుడి ముందే డ్యాన్స్ ఇరగదీసింది. బంధువుల్లో కొందరు ఆ నవ వధువు డ్యాన్స్ ను తమ సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఇక అదే వీడియోను ఓ ఇన్ స్టా గ్రామ్ ఐడీలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో అతి తక్కువ రోజుల్లోనే ఏకంగా 7.6 మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది. కాగా, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన చాలామంది ఒక్కోరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు.

Show comments