విషాదం: కూలిపోయిన సైనిక హెలికాప్టర్.. ముగ్గురు మృతి!

ఆస్ట్రేలియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ సైనిక హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మెరైన్స్ మరణించగా మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. అసలేం జరిగిందంటే? ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్రిడేటర్ రన్ పేరుతో యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, ఈస్ట్ తైమూర్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాకు చెందిన దాదాపు 2500 సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు సిద్దమయ్యారు.

ఇందులో భాగంగానే యుద్ద విన్యాసాల పనుల కోసం ఆదివారం అమెరికా మెరైన్ విభాగానికి చెందిన రెండు ఓస్పై హెలికాప్టర్లు డార్విన్ నుంచి 80 కిలీమీటర్ల దూరంలోని తివి ద్వీపానికి బయల్దేరాయి. ఈ క్రమంలోనే 23 మందితో వెళ్తున్న ఓ సైనిక విమానం మాల్విల్ ద్వీపం వద్ద ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మెరైన్స్ ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అక్కడి పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక ఘటనపై స్పందించి మరికొందరు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని శకలాలను గర్తించే పనిలో ఉన్నారు. ఇదే కాకుండా ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటనేది తెలుసుకునే పనిలో పడ్డారు.

ఇది కూడా చదవండి: HYD: డగ్స్ కేసులో ఎస్ఐని అరెస్ట్ చేసిన పోలీసులు!

Show comments