iDreamPost
android-app
ios-app

బాయ్ ఫ్రెండ్‌కు ఆ ఫోటోలు పంపిస్తున్నారా? ఈ ఘటన గురించి తెలుసుకోండి!

పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి విషయాన్ని ప్రియుడితో షేర్ చేసుకుంటున్నారు అమ్మాయిలు. మన ఇంట్లో కోడి కూసిన విషయం దగ్గర నుండి.. కోడి కోసుకుని వండుకున్న తిన్న విషయం కూడా కక్కేస్తుంటారు. అలాగే..

పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి విషయాన్ని ప్రియుడితో షేర్ చేసుకుంటున్నారు అమ్మాయిలు. మన ఇంట్లో కోడి కూసిన విషయం దగ్గర నుండి.. కోడి కోసుకుని వండుకున్న తిన్న విషయం కూడా కక్కేస్తుంటారు. అలాగే..

బాయ్ ఫ్రెండ్‌కు ఆ ఫోటోలు పంపిస్తున్నారా? ఈ  ఘటన  గురించి తెలుసుకోండి!

ఒకప్పుడు లవ్ స్టోరీస్ డీసెంట్‌గా ఉండేవి. తాము ప్రేమించుకుంటున్న విషయం తల్లిదండ్రులకు కూడా తెలిసేది కాదు. ప్రియుడు, ప్రియురాలు కలుసుకోవాలన్నా ఎవరికీ తెలియకుండా, చాటుమాటుగా కలుసుకునేవారు. కానీ నేడు ఈ ప్రేమ కథలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సెల్ ఫోన్స్ వచ్చాక విపరీత ధోరణికీ చేరుకున్నాయి. పొద్దున్న లేస్తూనే వాట్సప్‌లో గుడ్ మార్నింగ్ మెసేజ్‌తో పాటు లవ్లీ ఎమోజీస్‌తో లవర్స్‌ను ప్రసన్నం చేసుకుంటన్నారు. గంటలు గంటలు ఫోనులో మాట్లాడుతూనే ఉంటారు. అవి చాలవన్నట్లు తాము ఏం తింటున్నాం, ఎక్కడ తిరుగుతున్నాం, ఏ డ్రెస్ వేసుకున్నాం అన్న ప్రతి విషయాన్ని షేర్ చేస్తున్నారు. లైవ్ లొకేషన్స్, దిగిన ప్రతి ఫోటో, ఫుల్ అప్డేట్స్ ఇస్తూ.. అరటి పండు తొక్క వలిచి.. నోట్లో పెట్టిన చందంగా వ్యవహరిస్తున్నారు.

దీంతో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు కొందరు. అందులో అమ్మాయిలు ఏం తీసిపోలేదు. బేబీ, డార్లింగ్ అని పిలిస్తే చాలు గుంట ఫ్లాట్ అంతే. ‘నా దేవత, నువ్వు లేకపోతే నేను లేను. నా బిడ్డకు తల్లి అయ్యే ఛాన్స్ ఇస్తావా’ అంటూ ప్రియుడి చూపించే ఈ ఎక్స్ ట్రా కరిక్యులమ్ యాక్టివిటీ, ఆస్కార్ లెవల్ ఫెర్మామెన్స్‌కు ఫిదా అయిపోయిన ఆడ పిల్లలు.. ప్రియుడి కోరాలే గానీ కొండ మీద కోతిని కూడా తీసుకు వచ్చేందుకు రిస్క్ చేస్తున్నారు. అవసరమైతే పక్కన జీవితాలను కూడా రిస్కులో పెడుతున్నారు. తాజాగా ఓ అమ్మాయి.. తన ప్రియుడ్ని బుట్టలో వేసుకునేందుకు తన తోటి విద్యార్థినిల న్యూడ్ వీడియోలను ప్రియుడికి పంపింది. ప్రస్తుతం ఈ ఘటన దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఓ యూనివర్శిటీని విద్యార్థిని ..తోటి విద్యార్థినుల 900 వీడియోలను, ఫోటోలను బాయ్ ఫ్రెండ్‌కు పంపింది.

వాటిని చూసి ఎంజాయ్ చేస్తున్నాడు బాయ్ ఫ్రెండ్. ఈ విషయం తెలిసి.. పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు.. దీనిపై చర్యలకు ఉపక్రమించారు. ఈ ఒక్క విద్యార్థిని కారణంగా.. మిగిలిన జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. వారి గోప్యతకు భంగం కలిగించేలా, వారి జీవితాలతో ఆడలాడుతూ.. ఆమె వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాగా, ఇలాంటి ఘటనలు జరగకుండా మరింత కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు యూనివర్శిటీ అధికారులను కోరుతున్నారు. సో గర్ల్స్ బీ కేర్ ఫుల్. మనతోనే ఉంటూ.. మన ఫోటోలను తీసి.. వేరో వాళ్లకు పంపించే వ్యక్తులు ఉన్నారు. అలాగే బాయ్ ఫ్రెండ్, లవ్వర్ అడిగాడు కదా అని ఏ ఫోటోలో పడితే ఆ ఫోటోలు పెట్టొద్దని సూచిస్తున్నారు పోలీసులు. కాస్త అలర్ట్‌గా వ్యవహరించాలని హితవు కోరుతున్నారు. లైవ్ లొకేషన్స్,ఫోటోస్ వంటివి తల్లిదండ్రులతో కాకుండా మరెవ్వరికీ షేర్ చేయొద్దని సూచిస్తున్నారు.