iDreamPost
android-app
ios-app

వీడియో: గేదెల వీపు మీద సవారి చేస్తున్న శునకం!

వీడియో: గేదెల వీపు మీద సవారి చేస్తున్న శునకం!

ప్రస్తుతం సోషల్ మీడియా  యుగం నడుస్తున్నది. అందుకే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిన క్షణాల్లో తెలిసి పోతుంది. ఇలా కేవలం వార్తలే కాకుండా వివిధ రకాల వీడియోలు, వింత ఘటనలు సోషల్ మీడియా ద్వారా మన ముందు ప్రత్యక్షమవుతుంటాయి. ఇక తాజాగా ఓ వీడియో..నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఆ వీడియో ఏంటంటే.. ఓ శునకం.. గేదెలపై ఎక్కి..హాయిగా వీధులను చూస్తూ ఎంజాయి చేసింది.

ఈ భూమిపై స్నేహం అనేది కేవలం మనుషుల మధ్యనే కాదు.. నోరు లేని మూగ జీవాల మధ్య కూడా ఉంటుంది. అందుకే అవి కూడా ఎంతో స్నేహంగా కలిసి మెలసి తిరుగుతుంటాయి. ఇంకా కొన్ని మూగ జీవాలు జాతుల వైరం మరిచి కూడా మరో దానితో స్నేహం చేస్తుంటాయి. ఇలా మూగ జీవాలు.. తమ స్నేహితులతో హాయిగా విహరిస్తుంటాయి. తాజాగా ఓ శునకం సైతం గేదెలతో స్నేహం చేసినట్లుంది. అందుకే ఆ గేదె..తన వీపు మీద శునకాన్ని ఎక్కించుకుని ఎంచక్కా తీసుకెళ్లుంది.  కుక్క ఎంతసేపు తన మీద ఉన్న ఏ మాత్రం విదలకుండా, అదలకుండా హుందగా నడుచుకుంటూ వెళ్లింది.

కుక్క సైతం ఏదో విమానంలో వెళ్తున్నట్లు ఫీల్ అవుతూ.. చల్ చల్ గుర్రం చలాకీ గుర్రం అంటూ సంతోషంగా ఉంది. నీవల్ల మన ఏరియాల్లోని గల్లీలని చక్కగా చూస్తున్నాను మచ్చా అన్నట్లు కుక్క.. గేదెపై నిల్చుని ఫోజులు కొట్టింది. ఇక గేదె కూడా.. తనపై నమ్మకంతో ఎక్కిన కుక్కను కింద పడేయ వద్దన్నట్లు  మెల్లగా నడిచింది. ఇలా రెంటికి రెండు భలే సందడి చేశాయి. ఈ రెండిటి దోస్తానం చూసిన చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎక్కడ జరిగిందో  ఏమో తెలియదు కానీ.. ఈ ఘటన ప్రస్తుతం సోషళ్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom