iDreamPost
android-app
ios-app

మూడు రాజధానులు– ఆహ్వానించిన టీడీపీ ఎమ్మెల్యే

  • Published Dec 18, 2019 | 2:29 AM Updated Updated Dec 18, 2019 | 2:29 AM
  • Published Dec 18, 2019 | 2:29 AMUpdated Dec 18, 2019 | 2:29 AM
మూడు రాజధానులు– ఆహ్వానించిన టీడీపీ ఎమ్మెల్యే

ఏపీకి మూడు రాజధానులు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో రాజధాని అంశంపై జరిగిన చర్చలో ప్రకటించారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని, వికేంద్రీకరణ జరగాలన్నారు. సౌతాఫ్రికాకు మూడు రాజధానులున్నాయని, ఏపీకి బహుశా మూడు రాజధానులు రావచ్చునన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌.. కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ క్యాపిటల్‌.. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌ పెట్టొచ్చని సీఎం జగన్‌ చెప్పారు.

ఈ అంశంపై ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరత పాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటనపై చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని ఇంకా ఎన్ని ఊళ్లు తిరగాలి.? చరిత్ర పొడవునా ఆంధ్రులకు ఇదే ఖర్మా.? మొదట మద్రాసు, తర్వాత కర్నూలు, తర్వాత హైదరాబాద్‌, తర్వాత అమరావతి.. ఇప్పుడు మరోచోట. రాజధాని పేరుతో ఇంత అస్థిరత సృష్టిస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తారా? ఏడు నెలల్లో ఎవరైనా వచ్చారా.? రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. అభివృద్ధి ఆగిపోయింది.. అన్ని పనులు నిలిచిపోయాయి.. వైసీపీనేతలు విశాఖలో భూములు భారీగా కొన్నారని విన్నాం అంటూ జగన్ ప్రకటనపట్ల వ్యతిరేకంగా మాట్లాడారు.

Read Also: రాష్ట్రానికి మూడు రాజధానులు సాధ్యమా?

అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా అయ్యే అవకాశాలున్నాయంటూ శాసనసభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటనను స్వాగతిస్తున్నానని వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన ఒక ట్వీట్‌ చేశారు. అధికారిక వికేంద్రీకరణలో భాగంగా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ కావొచ్చన్న సీఎం నిర్ణయం మంచిదన్నారు. సముద్ర తీర ప్రాంతమైన విశాఖను పరిపాలనా రాజధాని చేయడం సరైనదేనని గంటా అభిప్రాయపడ్డారు. రోడ్డు, రైలు, విమానయానం, జల రవాణాతో అనుసంధానమైన విశాఖ నగరం పరిపాలనా రాజధానిగా మారితే.. విశ్వనగరంగా, రాష్ట్ర ప్రజలందరి ఆశలు, ఆకాంక్షల్ని నెరవేర్చే నగరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయనన్నారు.

Read Also: సీఎం రాజధాని ప్రకటనపై జనసేనాని వరుస ట్వీట్లు.. ప్రభావం ఉంటుందా.?

మరి పార్టీ అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా స్వరం మార్చిన గంటాపై పార్టీ చర్యలు తీసుకుంటుందా.? లేదా గంటానే ఈ వివాదం పట్టుకుని పార్టీని వీడుతారా అనే చర్చ కూడా మొదలవుతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş