Mahindra Scorpio-N: కొత్త‌ స్కార్పియో వ‌చ్చేసింది, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే.

Scorpio N కోసం బుకింగ్ జూలై 30 నుండి మొద‌ల‌వుతున్నాయి. ఆన్‌లైన్ , డీలర్‌షిప్‌ల ద‌గ్గ‌ర బుక్ చేసుకోవ‌చ్చు. పండుగ సీజన్ నుంచి డెలివరీలు మొద‌ల‌వుతాయి.

ఊరించి, ఊరించి మ‌హేంద్ర స్కార్పియోను ఆవిష్క‌రించింది. అదే ఠీవీ, కాని లుక్ మారింది. గ‌త స్కార్పియో క‌న్నా మ‌రింత మోడర్న్ లుక్ తో SUV ప్రీమియంగా క‌నిపిస్తోంది. కాని XUV700 SUV క‌న్నా త‌క్కువ రేటు. పెట్రోల్ ,డీజిల్ మోడ‌ల్స్ లో SUVని విడుదల చేసింది మ‌హేంద్ర‌. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లో ఎంపిక చేసుకోవ‌చ్చు. ఇంకోసంగ‌తి కొత్త స్కార్పియో N కూడా 4-వీల్ డ్రైవ్ వేరియంట్ ఉంది.

టెస్ట్ డ్రైవ్
మహీంద్రా స్కార్పియో N టెస్ట్ డ్రైవ్‌లు జూలై 5న టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. SUV Z2, Z4, Z6, Z8, Z8L వంటి ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.Mahindra Scorpio N Z2 Petrol బేస్ వేరియంట్ రూ. 11.99 ల‌క్ష‌లు( ఎక్స్ షోరూమ్) అదే హైఎండ్ Mahindra Scorpio N Z8L Diesel ధ‌ర రూ.19.49 lakh (ఎక్స్ షోరూమ్)

ఫీచ‌ర్స్

మహీంద్రా స్కార్పియోలో N XUV700లోని AdrenoX టెక్నాలజీ ఉంది. కొత్త SUV స్నాప్‌డ్రాగన్ SD6 ప్రాసెసర్ మీద ప‌నిచేస్తుంది. 70+ కార్ ఫీచర్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఫీచర్‌లను డాష్ బోర్డ్ మీదా, మొబైల్ యాప్‌లో కంట్రోల్ చేయొచ్చు

-7-అంగుళాల మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే
8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్.
-వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో , యాపిల్ కార్‌ప్లే
-GPS నావిగేషన్
-బ్లూటూత్ & USB కనెక్టివిటీ
-3D ఆడియోతో -12 స్పీకర్ సోనీ సిస్టమ్

సేఫ్టీ

6 ఎయిర్ బ్యాగ్స్ (Six airbags)
అడ్వాన్స్‌డ్ ఇఎస్ఇ (Advaced ESC)
కొలాప్స‌బుల్ స్టీరింగ్ సిస్ట‌మ్ (Collapsible Steering System)
డ్రైవ‌ర్ మ‌గ‌త‌లో ఉంటే అల‌ర్ట్ చేసే సిస్టమ్ (Driver Drowsiness Detection)

 

Show comments