iDreamPost
android-app
ios-app

అతనొక ప్రిన్సిపల్.. అయినా భార్య చేతుల్లో చిత్రహింసలు తప్పట్లేదు !

  • Published May 26, 2022 | 6:11 PM Updated Updated Dec 15, 2023 | 5:56 PM

అతనొక స్కూలికి ప్రిన్సిపల్ అయినా.. భార్య నానా చిత్రహింసలకు గురిచేస్తోంది. ఎవరికైనా చెపుదామంటే.. ఎవరూ నమ్మరని ఆఖరికి భార్య కొడుతుండగా.. దానిని సీక్రెట్ గా వీడియో తీసి వాటిని రిలీజ్ చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది.

అతనొక స్కూలికి ప్రిన్సిపల్ అయినా.. భార్య నానా చిత్రహింసలకు గురిచేస్తోంది. ఎవరికైనా చెపుదామంటే.. ఎవరూ నమ్మరని ఆఖరికి భార్య కొడుతుండగా.. దానిని సీక్రెట్ గా వీడియో తీసి వాటిని రిలీజ్ చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది.

  • Published May 26, 2022 | 6:11 PMUpdated Dec 15, 2023 | 5:56 PM
అతనొక ప్రిన్సిపల్.. అయినా భార్య చేతుల్లో చిత్రహింసలు తప్పట్లేదు !

గృహ హింస అనగానే.. పెళ్లైన ఆడపిల్లలు పడే బాధలు, కష్టాలే గుర్తొస్తాయి ఎవరికైనా. కానీ.. ఇది కొంచెం డిఫరెంట్. అతనొక స్కూలికి ప్రిన్సిపల్ అయినా.. భార్య నానా చిత్రహింసలకు గురిచేస్తోంది. ఎవరికైనా చెపుదామంటే.. ఎవరూ నమ్మరని ఆఖరికి భార్య కొడుతుండగా.. దానిని సీక్రెట్ గా వీడియో తీసి వాటిని రిలీజ్ చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది.

రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా భివాడీలో అజిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఉంటున్నాడు. అతనొక స్కూల్ కి ప్రిన్సిపల్. మంచి పేరు కూడా ఉంది. ఎనిమిదేళ్ల క్రితం సుమన అనే మహిళను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఏమైందో ఏమో గానీ.. పెళ్లైన కొన్నాళ్లకు సుమన ప్రవర్తనలో మార్పొచ్చింది. భర్తను చూస్తే చిరాకు, అసహ్యం. చేతికి ఏది దొరికితే దానితో కొట్టడం. ఇలా ఒకరోజు కాదు.. రెండ్రోజులు కాదు. కొన్ని నెలలుగా అజిత్ పరిస్థితి ఇదే.

భార్య తనను కొడుతుందని ఎవరికి చెప్పినా నవ్వుతారనుకున్నాడు. పైగా ఎవరూ నమ్మరని సీక్రెట్ గా వీడియోలు తీశాడు. అప్పడాల కర్ర, క్రికెట్ బ్యాట్, వాటర్ జగ్ ఇలా రోజుకొక వస్తువుతో చితకబాదేసేది. శారీరకంగానే కాకుండా మానసికంగా చిత్రహింసలకు గురిచేసింది. ఈ వీడియోలన్నింటినీ తీసుకుని కోర్టును ఆశ్రయించాడు. ఒక స్కూల్ కి ప్రిన్సిపల్ అవడం వల్ల.. ఇన్నాళ్లూ వీటని భరిస్తూ వచ్చానని.. ఇక భరించలేక కోర్టుముందు లబోదిబోమన్నాడు. అజిత్ సింగ్ బాధను అర్థం చేసుకున్న న్యాయస్థానం.. పోలీసు సెక్యూరిటీ కల్పించింది.

 

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet