iDreamPost
android-app
ios-app

రైల్వే ట్రాక్ పై యూట్యూబర్ పిచ్చి పని.. మండిపడుతున్న నెటిజన్లు!

  • Published Nov 09, 2023 | 1:09 PM Updated Updated Nov 09, 2023 | 1:09 PM

ఈ మద్య కొంతమంది యూట్యూబర్లు క్రేజీ వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. కొన్నిసార్లు అవి ఎంటర్‌టైన్‌మెంట్ గా అనిపించినా.. కొన్నిసార్లు భయం పుట్టించేలా ఉంటాయి. అలాంటి వీడియోలు తీసే యూట్యూబర్ల ప్రాణాలకే కాదు.. చుట్టు పక్కల వాళ్లకు ప్రమాదం జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఈ మద్య కొంతమంది యూట్యూబర్లు క్రేజీ వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. కొన్నిసార్లు అవి ఎంటర్‌టైన్‌మెంట్ గా అనిపించినా.. కొన్నిసార్లు భయం పుట్టించేలా ఉంటాయి. అలాంటి వీడియోలు తీసే యూట్యూబర్ల ప్రాణాలకే కాదు.. చుట్టు పక్కల వాళ్లకు ప్రమాదం జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

  • Published Nov 09, 2023 | 1:09 PMUpdated Nov 09, 2023 | 1:09 PM
రైల్వే ట్రాక్ పై యూట్యూబర్ పిచ్చి పని.. మండిపడుతున్న నెటిజన్లు!

టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది మనుషుల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే భావిస్తుంటారు. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు మన కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. కొన్ని వీడియోలు నవ్వులు పుట్టించే విధంగా ఉంటే.. కొన్ని వీడియోలు భయాన్ని కలిగించేలా ఉంటాయి. ఇటీవల చాలా మంది వెరైటీ వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు.. అవి క్లిక్ అయితే రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అవుతున్నారు. సోషల్ మీడియాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా ద్వారా ఒక్కసారే పాపులర్ అయినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అంతేకాదు చాలా మంది సోషల్ మీడియాకు అడిక్ట్ కూడా అవుతున్నారు.. సెన్సేషన్ వీడియో క్రియేట్ చేసి యూట్యూబ్ ద్వారా పాపులర్ కావాలని రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు కొన్నిసార్లు ప్రాణాల మీదకు కూడా తెస్తున్నాయి. తాజాగా ఓ యూట్యూబర్ చేసిన పనికి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఈ మద్య కాలంలో చాలా మంది ఔత్సాహికులు ఇన్ స్ట్రాగామ్, యూట్యూబ్ లో క్రేజ్ సంపాదించడానికి పిచ్చి సాహసాలు చేస్తుంటారు. కొంతమంది మంది తమ వద్ద ఉన్న కంటెంట్ నమ్ముకుంటే.. మరికొందరు ప్రమాదకరమైన ఫీట్స్ చేస్తూ వారి ప్రాణాల మీదకే కాదు.. ఇతరులను కూడా బలి చేస్తుంటారు. తోటి వారి ప్రాణాలు రిస్క్ లో పెట్టి పాపులర్ కావాలని ప్రయత్నిస్తుంటారు. ఓ య్యూటబర్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అతడి ప్రాణాలతోనే కాదు.. జనాలను కూడా రిస్క్ లో పెట్టే విధంగా వీడియో చేశాడు. ఇంతకీ ఆ యూట్యూబర్ ఏం చేశాడంటే.. రైల్వే ట్రాక్ పై స్నేక్ క్రాకర్స్ కుప్పగా పోశాడు. వాటిని కాల్చడంతో మంటలు వస్తూ.. గుప్పున పొగ వెదజల్లుతూ కాలింది. ఈ వీడియో 33 సెకన్ల నిడివి ఉంది. పులేరా-అజ్మీర్ సెక్షన్ లోని దంత్రా స్టేషన్ ప్రాంతంలో షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యూస్, లైక్స్ కోసం ఇలాంటి పిచ్చి పనులైనా చేస్తారా? ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే.. రైల్లో వందల సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు.. వారంతా ఏం జరిగిందో అని టెన్షన్ కి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారు.. అతనిపై చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖను కోరారు.

సోషల్ మీడియాలో ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై డివిజనల్ రైల్వే మేనేజర్, జైపూర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీరియస్ అయ్యారు.. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. వెంటనే రైల్వే పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సదరు యూట్యూబర్ ని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ‘రైల్వే ట్రాక్‌లపై ఇలాంటి ప్రమాదకర క్రాకర్స్ కాల్చడం వల్ల అగ్ని రూపలంలో ప్రమాదాలలు జరగవొచ్చు. దయచేసి ఇలాంటి దుర్మార్గులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోండి ’ అని ఓ నెటిజన్ రైల్వే పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉంటే.. పాము బిల్లలు( స్నేక్స్ క్రాకర్ ) అనేవి అత్యధిక మోతాదులో పీఎం.5 ను విడుదల చేస్తాయి. 2016 నాటి చెస్ట్ రిసెర్స్ ఫౌండేషన్ (సీఆర్ఎఫ్) పూణే విశ్వవిద్యాలయం పరిశోధనలో తెలిపారు.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetCasibomHoliganbetHoliganbetCasibomcasibomjojobet güncel girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetMadridbetJojobetjojobetJojobetjojobetjojobetgrandpashabetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobet