iDreamPost
android-app
ios-app

వీడియో: కదులుతున్న రైల్లో ఒక్కటైన ప్రేమ జంట! ప్రేమ గుడ్డిదే!

  • Published Dec 01, 2023 | 3:35 PM Updated Updated Dec 01, 2023 | 3:35 PM

ఈ మద్య కాలంలో జనరల్ ట్రైన్, మెట్రో ట్రైన్స్ లో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ మద్య కాలంలో జనరల్ ట్రైన్, మెట్రో ట్రైన్స్ లో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • Published Dec 01, 2023 | 3:35 PMUpdated Dec 01, 2023 | 3:35 PM
వీడియో: కదులుతున్న రైల్లో ఒక్కటైన ప్రేమ జంట! ప్రేమ గుడ్డిదే!

సాధారణంగా పెళ్లి అనగానే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి పెద్దలు ఓకే అంటే నిశ్చితార్థం… పెళ్లి తంతు జరిపిస్తారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది.. ప్రేమ పెళ్లిళ్ళ జమానా ఎక్కువగా నడుస్తుంది. సాంప్రదాయ వివాహాలకు చాలా మంది స్వస్తి చెబుతూ.. తమకు ఇష్టమైన పద్దతుల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. విమానాలు, పార్కులు, సముద్ర భూగర్భాలు ఎన్నో రకాల వెరైటీ పద్దతుల్లో తమ వివాహ వేధికలను ఏర్పాటు చేసుకొని మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. కొంతమంది ప్రేమికులు పెళ్లి చేసుకోవడానికి ప్లేస్ గురించి ఆలోచించడం లేదు.. దీనికి ఉదాహరణ ఓ యువజంట పెళ్లి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రక రకాల వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల మెట్రో ట్రైన్, జనరల్ ట్రైన్స్ లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భారతీయ రైల్వేతో బహుళ ప్రయోజనాలు ఉన్న విషయం తెలిసిందే. సుధూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు రైలు ప్రయాణం ఎంతో సురక్షితం అని నమ్ముతారు. కానీ ఈ మధ్య పలు రైళ్లల్లో రీల్స్ చేయడం, సెల్ఫీలు తీసుకోవడం, డ్యాన్స్ లు చేయడం, కొన్ని సందర్భాల్లో ప్రేమికులు రొమాన్స్ చేసుకోవడం ఇలా ఎన్నో రకాల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.   ప్రయాణికులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించే ట్రైన్ ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రైల్వే సిబ్బంది ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అక్కడక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ గుడ్డిది అంటారు.. కానీ ప్రేమలో ఉన్న ఓ జంట ప్లేస్ కూడా చూడకుండా పెళ్లికి తొందర పడ్డారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువజంట తోటి ప్రయాణికుల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తర్వాత దండలు మార్చుకున్నారు. దండలు మార్చుకున్న తర్వాత భావోద్వేగంతో వధువు.. వరుడి ఆలింగంనం చేసుకొని కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంది. ఆ యువకుడు యువతి నుదిట తిలకం దిద్ది.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ప్రయాణికులు కొత్త జంటను ఆశీర్వదిస్తూ.. జై భోలేనాథ్ అంటూ దీవించారు. ఈ పెళ్లితంతుకు సంబంధించిన ఘటన అసన్సోల్ – జాసిదహ్ ట్రైన్ లో చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక రుజువు లేదు. మొత్తానికి కదులుతున్న ట్రైన్ లో ప్రయాణికుల సాక్షిగా ఒక్కటయ్యారు ప్రేమికులు. ట్రైన్ లో జరుగుతున్న ఇలాంటి ఘటనల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Yadav Max Sudama (@max_sudama_1999)

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet